Whats app new update : మెసేజ్ పంపిన 2 రోజులు తర్వాతా డిలీట్ చేసుకోవచ్చు

వాట్సప్ యూజర్లకు గుడ్ న్యూస్... మరో కొత్త సదుపాయాన్ని వాట్సాప్‌ (Whatsapp) అందుబాటులోకి తీసుకొచ్చింది. యూజర్లు రెండు రోజుల కింద తాము పంపిన మెసేజ్‌లను సైతం ఇకపై డిలీట్‌ చేసుకునే సౌకర్యాన్ని తెచ్చింది. ట్విటర్‌ వేదికగా ఈ విషయాన్ని వాట్సాప్‌ పేర్కొంది.

Whats app new update : మెసేజ్ పంపిన 2 రోజులు తర్వాతా డిలీట్ చేసుకోవచ్చు

whats app new update

Whats app new update :  వాట్సప్ యూజర్లకు గుడ్ న్యూస్… మరో కొత్త సదుపాయాన్ని వాట్సాప్‌ (Whatsapp) అందుబాటులోకి తీసుకొచ్చింది. యూజర్లు రెండు రోజుల కింద తాము పంపిన మెసేజ్‌లను సైతం ఇకపై డిలీట్‌ చేసుకునే సౌకర్యాన్ని తెచ్చింది. ట్విటర్‌ వేదికగా ఈ విషయాన్ని వాట్సాప్‌ పేర్కొంది.

ఇప్పటికే కొందరు యూజర్లకు ఈ సదుపాయం అందుబాటులోకి రాగా.. త్వరలోనే యూజర్లందరికీ ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. మీకు ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చిందో లేదో ఓ సారి చెక్‌ చేసుకోండి.   గతంలో వాట్సాప్‌లో ఏదైనా మెసేజ్‌ పంపితే దాన్ని డిలీట్‌ చేసుకునే సదుపాయం ఉండేది కాదు. దీంతో పొరపాటున పంపిన మెసేజ్‌ల విషయంలో యూజర్లు ఇబ్బంది పడేవారు.

దీంతో ఇలాంటి  మెసేజ్‌లను   తొలగించేందుకు   డిలీట్‌ ఆప్షన్‌ను   వాట్సాప్‌ పరిచయం చేసింది.   అయితే  ఇప్పటి వరకు  మెసేజ్‌ పంపిన 1 గంట 8 నిమిషాల 16 సెకన్లలోపే డిలీట్‌ చేసుకునేందుకు వీలుండేది.  ఇకపై ఇలాంటి మెసేజ్ లను 60 గంటల లోపు…  అంటే 2 రోజుల 12  గంటల లోపు  మనం పంపించిన పాత మెసేజ్ ను డిలీట్ చేయవచ్చు.

మరోవైపు వాట్సాప్‌ గ్రూప్‌ అడ్మిన్ల కోసం మరో సదుపాయం కూడా తీసుకు వస్తోంది.  గ్రూప్‌ సభ్యులు పంపిన మెసేజ్‌ను అడ్మిన్‌ తొలగించే సదుపాయం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది.  ప్రస్తుతం ఇది బీటా దశలో ఉంది.  యూజర్లు పంపిన మెసేజ్‌ను ఎడిట్‌ చేసుకునే వెసులు బాటునూ తీసుకొచ్చేందుకూ వాట్సాప్‌ ప్రయత్నాలు చేస్తోంది.

Also Read :Langya Henipa Virus In China : చైనాలో మరో కొత్త వైరస్ కలవరం..35 కేసులు నమోదు