హైదరాబాద్‌లో దారుణం : హెయిర్ కటింగ్‌కు వెళితే చంపేశారు

సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. కటింగ్ చేయించుకునేందుకు వెళితే ఓ యువకుడి ప్రాణాలే పోయాయి.

  • Publish Date - April 20, 2019 / 01:48 PM IST

సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. కటింగ్ చేయించుకునేందుకు వెళితే ఓ యువకుడి ప్రాణాలే పోయాయి.

హైదరాబాద్ : సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. కటింగ్ చేయించుకునేందుకు వెళితే ఓ యువకుడి ప్రాణాలే పోయాయి. కటింగ్ షాపు యజమానితో జరిగిన వాగ్వాదం అతడి ప్రాణాలు తీసింది. డబ్బు ఇచ్చే విషయంలో యువకుడికి, యజమానికి ఘర్షణ జరిగింది.
Also Read : జూ పార్కులో కలకలం : సందర్శకులపై పడిన చెట్టు

ఈ ఘర్షణలో ఆ షాపు యజమాని దగ్గర ఉండే ఐదుగురు బాడీబిల్డర్లు సదురు యువకుడిని గట్టిగా బిగించారు. ఊపిరి ఆడకుండా చేశారు. దీంతో ఆ యువకుడు చనిపోయాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతుడిని కార్తిక్ గా గుర్తించారు. కార్తిక్ మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కరమ్ బాగ్ లోని హెయిర్ సెలూన్ లో ఈ ఘటన జరిగింది.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. షాపు యజమానితో పాటు ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. గొడవకి డబ్బు వ్యవహారమేనా లేక మరో కారణమా అని తెలుసుకునే పనిలో ఉన్నారు. కార్తిక్, షాపు యజమానికి మధ్య గతంలో ఏమైనా గొడవలు ఉన్నాయా అని ఆరా తీస్తున్నారు. హెయిర్ కటింగ్ చేయించుకున్నాక డబ్బు వ్యవహారంలో గొడవ జరగడం, ఒకరి ప్రాణం తీయడం స్థానికంగా కలకలం రేపింది.