ఆ పనికి ఒప్పుకోనందుకు.. అత్తను దారుణంగా చంపిన పదో తరగతి బాలుడు

Karnataka Crime News: దీంతో ఆమెకు మెళుకువ వచ్చి ఆ బాలుడిని తిట్టింది. తన చర్య గురించి ఆమె..

Crime

సొంత అత్తను దారుణంగా చంపాడో పదో తరగతి బాలుడు. కర్ణాటకలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. దక్షిణ కన్నడ జిల్లా ఉప్పినంగడి సమీపంలోని ఓ గ్రామంలో.. ఓ ఇంట్లో 37 ఏళ్ల మహిళ విగత జీవిగా కనపడింది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించి ఆమెను చంపింది మైనర్ బాలుడైన ఆమె మేనల్లుడేనని గుర్తించారు.

పదో తరగతి చదువుతున్న ఓ బాలుడు తన అత్త ఇంటికి వచ్చాడు. ఆమె నిద్రిస్తుండగా లైంగిక చర్యకు పాల్పడానికి ప్రయత్నించాడు. దీంతో ఆమెకు మెళుకువ వచ్చి ఆ బాలుడిని తిట్టింది. తన చర్య గురించి ఆమె ఇతరులకు చెబుతుందన్న భయంతో ఆమెను ఆ బాలుడు చంపేయాలని నిర్ణయించుకున్నాడు.

మెత్తతో ఆమెకు ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశాడు. అనంతరం తన తండ్రి వద్దకు వెళ్లి ఆమె గుండెపోటుతో మరణించిందని చెప్పాడు. దీనిపై ఆ బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మృతురాలి వీపుపై గాయాలు కూడా కనపడ్డాయి. మైనర్ బాలుడిపై పోలీసులకు అనుమానం వచ్చి అతడిని ప్రశ్నించగా తానే హత్య చేశానని ఒప్పుకున్నాడు.

Also Read: బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు

ట్రెండింగ్ వార్తలు