బ్యాంకు అధికారులు లోన్ మంజూరు చేయలేదని వారిపై ఓ వ్యక్తి దాడి చేసిన ఘటన తమిళనాడులో జరిగింది. కోయంబత్తూరులోని కెనరాబ్యాంక్ బ్రాంచ్ లో వెట్రివేల్ అనే వ్యక్తి కోటి రూపాయలు రుణం కోసం బ్యాంకుకు దరఖాస్తు చేసుకున్నాడు. రుణానికి ష్యూరిటీగా తన స్ధిరాస్తి కాగితాలు కూడా సమర్పించాడు. ఎలాంటి అడ్డంకులు లేకుండా రుణం మంజూరు చేయించేందుకు ఓ దళారీకి 3లక్షల రూపాయలు కూడా ఇచ్చాడు.
రుణ మంజూరు ప్రక్రియలో సరైన కాగితాలు లేనందున అతడి దరఖాస్తును బ్యాంకు అధికారులు తిరస్కరించారు. బ్యాంకు అధికారులు తన దరఖాస్తు తిరస్కరించటంతో వెట్రివేల్ ఆగ్రహానికి గురయ్యాడు. అసహనంతో బ్యాంకు అధికారులపై కత్తి, తుపాకీతో దాడికి పాల్పడ్డాడు. దాడి నుంచి అధికారులను రక్షించబోయిన మరో ఇద్దరికి కూడా గాయాలయ్యాయి. బ్యాంకు సిబ్బంది అతడ్ని బంధించి పోలీసులకు అప్పగించారు. తాను వ్యాపారంలో అప్పుల్లో మునిగిపోయానని, రుణం మంజూరు కాకపోతే ఆత్మహత్యే చేసుకోవాలనుకున్నట్లు వెట్రివేల్ పోలీసులకు తెలిపాడు.
కాగా … వెట్రివేల్ రుణం కోసం దరఖాస్తు చేసుకున్న మొత్తం ఎక్కువగా ఉందని, అందువల్ల దరఖాస్తు తిరస్కరించినట్లు బ్యాంకు అధికారులు తెలిపారు. ఒకవేళ అతను మరికొన్ని ఆస్తులు తనఖా పెట్టినప్పటికీ అంత మొత్తం రుణం మంజూరు చేయటం తమ బ్రాంచ్ పరిధి కాదని, హెడ్ ఆఫీసు నిర్ణయమని అధికారులు వివరించారు.
వెట్రివేల్ సోమాయపాళ్యంలో ఒక చిన్న పరిశ్రమను నిర్వహిస్తున్నాడు. ఆ పరిశ్రమ నిర్వహణ కోసం, పరిశ్రమను తాకట్టు పెట్టి ఆంధ్రాబ్యాంకు నుంచి ఇప్పటికే 25 లక్షల అప్పుతీసుకుని ఉన్నాడు. వ్యాపారంలో నష్టాలు ఎక్కువ కావటంతో రుణాలు తిరిగి చెల్లించలేక పోతున్నాడు. వ్యాపార విస్తరణకోసం, పాతరుణాలుతీర్చటానికి కెనరాబ్యాంకు నుంచి కోటి రూపాయలు రుణం కోరాడు. కోటిరూపాయలు రుణం ఎటువంటిఇబ్బందులు లేకుండా మంజూరు చేయించేందుకుగుణబాలన్ అనే దళారీకి లక్షల రూపాయలు కమీషన్ కూడా ఇచ్చాడు. చివరికి లోను మంజూరు కాకాపోవటంతో ఈ దాడికి పాల్పడ్డాడు.
Customer attacks staff at Canara bank in Coimbatore over delay in processing of his loan @thenewsminute pic.twitter.com/nKQ0ZPLMPz
— priyankathirumurthy (@priyankathiru) December 4, 2019