డ్రగ్స్ కేసులో కాంగ్రెస్ నేత కుమారుడు అరెస్ట్

  • Publish Date - December 9, 2019 / 10:03 AM IST

హైదరాబాద్‌లో మరోసారి మత్తు పదార్థాల పట్టివేత కలకలం రేపింది. ఈసారి కాంగ్రెస్ నేత కత్తి వెంకటస్వామి కుమారుడు.. డ్రగ్స్‌తో పట్టుబడటం మరింత సంచలనం రేపుతోంది. కత్తి వెంకటస్వామి తనయుడు చాణక్య మత్తుపదార్ధాలు కలిగి ఉండగా  పోలీసులుకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. 

ఈ విషయం తెలుసుకున్న ఈస్ట్‌ జోన్‌ టాస్క్‌ ఫోర్స్‌  పోలీసులు… అంబర్‌పేటలో అతడిని అదుపులోకి తీసుకున్నారు. తన బర్త్డే పార్టీ కోసం జమ్ముకశ్మీర్ నుంచి డ్రగ్స్ తెప్పించినట్లు పోలీసుల ముందు  ఒప్పుకున్నాడు. చాణక్య వద్ద నుంచి  రూ. 1.20 లక్షల విలువైన 40 ఎల్‌ఎస్‌డీ స్ట్రిప్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.