కాంగ్రెస్ ఎమ్మెల్యేకు చలానా వేసిన పోలీసులు

ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన బీహార్‌ కాంగ్రెస్ ఎమ్మెల్యే అబిదుర్ రెహ్మాన్‌కు పాట్నా పోలీసులు జరిమానా విధించారు. మోటారు సైకిల్‌పై వెనుక వైపు కూర్చున్న రెహ్మాన్ ఆ సమయంలో హెల్మెట్ ధరించలేదు. దీంతో ఆయన రూ.1000 చలానా కట్టాల్సి వచ్చింది.

  • Publish Date - September 23, 2019 / 01:03 PM IST

ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన బీహార్‌ కాంగ్రెస్ ఎమ్మెల్యే అబిదుర్ రెహ్మాన్‌కు పాట్నా పోలీసులు జరిమానా విధించారు. మోటారు సైకిల్‌పై వెనుక వైపు కూర్చున్న రెహ్మాన్ ఆ సమయంలో హెల్మెట్ ధరించలేదు. దీంతో ఆయన రూ.1000 చలానా కట్టాల్సి వచ్చింది.

కొత్త మోటారు వాహాన చట్టం అమల్లోకి వచ్చాక దేశవ్యాప్తంగా  పోలీసులు పలు రాష్ట్రాల్లో చట్టాన్ని కచ్చితంగా అమలు చేస్తున్నారు. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన వారు ఎంతటి వారైనా వారికి భారీ స్ధాయిలో చలాన్లు విధిస్తున్నారు. 

ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన బీహార్‌ కాంగ్రెస్ ఎమ్మెల్యే అబిదుర్ రెహ్మాన్‌కు పాట్నా పోలీసులు జరిమానా విధించారు. మోటారు సైకిల్‌పై వెనుక వైపు కూర్చున్న రెహ్మాన్ ఆ సమయంలో హెల్మెట్ ధరించలేదు. దీంతో ఆయన రూ.1000 చలానా కట్టాల్సి వచ్చింది. వెహికల్ పేపర్లన్నీ సరిగానే ఉన్నప్పటికీ ఆయన వెనుక సీట్లో హెల్మెట్ లేకుండా కూర్చొన్నందున అపరాధ రుసుము విధించినట్టు పాట్నా పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
 
మోటార్ వాహనాల (సవరణ) చట్టం-2019 నిబంధనలను గత నెలలో కేంద్ర రోడ్ ట్రాన్స్‌పోర్స్ అండ్ హైవేస్ మంత్రిత్వ శాఖ నోటిఫై చేసింది. దీంతో  సెప్టెంబర్  1 నుంచి కొత్త చట్టం అమల్లోకి వచ్చింది. ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినందున దేశవ్యాప్తంగా పలువురు భారీ జరిమానాలు చెల్లించుకుంటున్నారు.