కడపలో ఇసుక మాఫియా బరితెగింపు : కానిస్టేబుల్‌ను ట్రాక్టర్‌తో ఢీకొట్టారు

  • Publish Date - April 28, 2019 / 05:41 AM IST

ఇసుక మాఫియా బరి తెగించింది. మా ట్రాక్టర్లనే అడ్డుకుంటావా ? అంటూ ఓ కానిస్టేబుల్‌పైకి ట్రాక్టర్‌ను పోనిచ్చారు. అక్రమంగా ఇసుకను తరలిస్తుండగా కానిస్టేబుల్ అడ్డుకోవడంతో ఈ ఘటన చోటు చేసుంది. ఇసుక మాఫియా ఎంతటి తీవ్రస్థాయిలో ఉందో ఈ ఘటనే ఉదాహరణ. ఏపీలో ఇసుక మాఫియా రెచ్చిపోతూనే ఉంది. ఈ అక్రమ వ్యాపారం మూడు ట్రాక్టర్లు..ఆరు లారీలుగా కొనసాగుతోంది. కొందరు అధికారులు, కాంట్రాక్టర్ల మిలాఖత్‌తో ఇసుక దందా చేస్తున్నారు. 

కడప జిల్లా జమ్మలమడుగు మండలం శేషారెడ్డిపల్లెలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని పోలీసులకు సమాచారం వచ్చింది. ఏప్రిల్ 28వ తేదీ ఆదివారం ఉదయం 5.30గంటల ప్రాంతంలో ఘటనా ప్రదేశానికి వెళ్లారు పోలీసులు. ఏమాత్రం బెదరని డ్రైవర్లు ట్రాక్టర్లను ముందుకు పోనిచ్చారు. వాటిని అడ్డుకోవడానికి పోలీసులు ట్రై చేశారు. రామాంజానేయులు అనే కానిస్టేబులో.. ట్రాక్టర్ ముందు నిలబడ్డాడు. కనికరం లేకుండానే ట్రాక్టర్‌తో ఢీకొట్టారు. రామాంజనేయులుకు తీవ్రగాయాలయ్యాయి. పారిపోవడానికి ప్రయత్నించిన ఆరుగురు డ్రైవర్లను అదుపులోకి తీసుకుని..ట్రాక్టర్లను సీజ్ చేశారు. రామాంజనేయులుని సమీప ఆస్పత్రికి తరలించారు. అతని హెల్త్ కండీషన్ సరిగ్గా లేకపోవడంతో రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.