Man Arrested Due To Cell Phones Theft
Cell Phones Theft : హైదరాబాద్‌లో సెల్‌ఫోన్‌లు చోరీ చేస్తున్న వ్యక్తిని చైతన్యపురి పోలీసులు అరెస్ట్ చేశారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో నివసించే కోయలకొండ రాధకళ్యాణ్ వనస్థలిపురం, హాయత్ నగర్ , ఉప్పల్, మీర్ పేట, చైతన్య పురి, సరూర్ నగర్ ప్రాంతాల్లో సేల్ ఫోన్స్, ల్యాప్ టాప్‌లు చోరీ చేసాడు.
అతని వద్దనుంచి 25 సెల్‌ఫోన్‌లు, ఒక ల్యాప్‌టాప్, ఒక ద్విచక్ర వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. స్వాధీనం చేసుకున్న సెల్ ఫోన్లను, వాటి యజమానులను గుర్తించి వారికి అందచేసినట్లు చైతన్యపురి పోలీసులు తెలిపారు.