Ramayampet : రామాయంపేట తల్లీ, కొడుకుల ఆత్మహత్య కేసులో 6 నిందితులు అరెస్ట్

మెదక్ జిల్లా రామాయంపేట కు చెందిన తల్లీ, కొడుకు ఆత్మహత్య కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమ చావుకు ఏడుగురు కారణమని చెపుతూ సెల్ఫీ వీడియో విడుదలచేసి తల్లి

Ramayampet :  మెదక్ జిల్లా రామాయంపేట కు చెందిన తల్లీ, కొడుకు ఆత్మహత్య కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమ చావుకు ఏడుగురు కారణమని చెపుతూ సెల్ఫీ వీడియో విడుదలచేసి తల్లి పద్మ, కుమారుడు సంతోష్ లు కామారెడ్డిలోని ఒకహోటల్ లో ఈ నెల 16న ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా గత రెండు మూడు రోజులుగా సంచలనం సృష్టించింది.

వారి చావుకు కారణమైన రామాయం పేట్ మున్సిపల్ చైర్మన్ ఇంటి ఎదుట 16వతేదీ బాధితు కుటుంబ సభ్యలు స్ధానికులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. కాగా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కోంటున్న నిందితులు  బాన్సువాడ డీఎస్పీముందు లొంగిపోయినట్లు సమాచారం. కానీ… తామే పట్టుకున్నామని  పోలీసులు ప్రకటించారు.  ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించారనే ఆరోపణతో నిందితులపై కామారెడ్డి పోలీసులు ఐపీసీ సెక్షన్ 306 ప్రకారం కేసులు నమోదు చేశారు.

పల్లె జితేందర్ గౌడ్ రామయంపేట్ మున్సిపల్ చైర్మన్, సరాఫ్ యాదగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్,ఐరేని పృథ్వీ గౌడ్, తోట కిరణ్, కన్నపురం కృష్ణ గౌడ్, సరాప్ స్వరాజ్…లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, కాగా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కోమన్న సీఐ నాగార్జునను పోలీసులు అరెస్ట్ చేయకపోవటం పలు విమర్శలకు తావిస్తోంది. కాగా నిందితులను పోలీసులు ఈరోజు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.

Also Read : Instagram down : ప్రపంచవ్యాప్తంగా స్తంభించిన ఇన్‌స్టాగ్రామ్ సేవలు.. యాప్ ఈజ్ బ్యాక్..!

ట్రెండింగ్ వార్తలు