Instagram down : ప్రపంచవ్యాప్తంగా స్తంభించిన ఇన్‌స్టాగ్రామ్ సేవలు.. యాప్ ఈజ్ బ్యాక్..!

Instagram down : ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ ఫొటో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్ (Instagram down) సర్వీసులు కొన్ని గంటల పాటు స్తంభించిపోయాయి.

Instagram down : ప్రపంచవ్యాప్తంగా స్తంభించిన ఇన్‌స్టాగ్రామ్ సేవలు.. యాప్ ఈజ్ బ్యాక్..!

Instagram Down Insta Mobile App Working After Suffering Global Outage

Instagram down : ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ ఫొటో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్ (Instagram down) సర్వీసులు కొన్ని గంటల పాటు స్తంభించిపోయాయి. చాలామంది ఇన్‌స్టా యూజర్లు తమ ప్రొఫైల్ కూడా యాక్సస్ చేసుకోలేకపోయారు. మరికొంతమంది ఫీడ్ కూడా రీఫ్రెష్ చేయలేకపోయినట్టు సోషల్ మీడియా వేదికగా ఫిర్యాదులు చేశారు.

ఇన్‌స్టా స్టోరీస్ (Insta Stories), Reels (రీల్స్) పనిచేస్తున్నప్పటికీ ఇన్ స్టా యాప్ యాక్సస్ చేసుకోవడంలో ఇబ్బందులు ఎదురైనట్టు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అయితే కొన్ని గంటల తర్వాత మళ్లీ ఇన్ స్టా సర్వీసులు తిరిగి పనిచేస్తున్నాయని ఓ నివేదిక వెల్లడించింది. ఇన్ స్టా సర్వీసులకు అంతరాయం ఏర్పడటంపై పేరంట్ కంపనీ మెటా (Meta) నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఔటేజ్ ట్రాకింగ్ వెబ్‌సైట్ డౌన్‌డెటెక్టర్ (DownDetector) భారతీయ ప్రామాణిక సమయం (IST) రాత్రి 10:45PM నుంచి ఇన్‌స్టాగ్రామ్ డౌన్ అయిందని వెల్లడించింది.

Instagram Down Insta Mobile App Working After Suffering Global Outage (1)

Instagram Down Insta Mobile App Working After Suffering Global Outage

ఈ వెబ్‌సైట్ ప్రకారం.. చాలా మంది ఇన్‌స్టా యూజర్లు ఫీడ్, ప్రొఫైల్‌లను లోడింగ్ సమయంలో అనేక సమస్యలను ఎదుర్కొన్నారు. డెస్క్‌టాప్ వెర్షన్ మాత్రం సరిగానే పనిచేస్తుంది. అయితే మొబైల్ ఇన్ స్టా యాప్, వెబ్ రెండింటిలోనూ స్టోరీలు, రీల్స్ సరిగ్గా లోడ్ అవుతున్నాయి. డౌన్‌డిటెక్టర్ వెబ్‌సైట్ చాలా మంది యూజర్ల ఫీడ్, ప్రొఫైల్‌లను రిఫ్రెష్ చేయడంలో సమస్యలను ఎదుర్కొంటున్నట్లు చూపిస్తోంది.

ఇక మెటా యాజమాన్యంలోని ఫోటో షేరింగ్ యాప్ ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన అంతరాయం గురించి ఎలాంటి వివరాలను వెల్లడించలేదు. ఇన్‌స్టా ఫీడ్, ప్రొఫైల్‌లు లోడ్ కాలేదని, రీల్స్, స్టోరీలు సరిగానే పని చేస్తున్నాయని డౌన్‌డిటెక్టర్ పేర్కొంది. ఇన్‌స్టాగ్రామ్‌కు అంతరాయం ఏర్పడటంతో చాలా మంది యూజర్లు మైక్రోబ్లాగింగ్ ట్విట్టర్‌ వేదికగా తమకు కలిగిన అసౌకర్యాన్ని ట్వీట్ల ద్వారా ప్రస్తావించారు.

Read Also : Instagram Blue Tick : ఇన్‌స్టాలో ‘బ్లూ టిక్’ ఇలా తెచ్చుకోవచ్చు..? ఇదిగో సింపుల్ ప్రాసెస్..!