Psycho Killer : సైకో కిల్లర్ ను అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు

హైదరాబాద్ లో ఇటీవల రెండు వేర్వేరు చోట్ల ఇద్దరు యాచకులను హత్య చేసిన  ఘటనలో  సైకో కిల్లర్ ను పోలీసులు ఈరోజు అదుపులోకి తీసుకున్నారు.

Psycho Killer Arrested

Psycho Killer : హైదరాబాద్ లో ఇటీవల రెండు వేర్వేరు చోట్ల ఇద్దరు యాచకులను హత్య చేసిన  ఘటనలో  సైకో కిల్లర్ ను పోలీసులు ఈరోజు అదుపులోకి తీసుకున్నారు. మొదటి హత్య నవంబర్ 1వ తేదీన హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరగగా.. రెండో హత్య నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

యాచకులు ఇద్దరినీ తలపై రాయితో మోది చంపేశారు. రెండు హత్యల్లో కూడా చంపడానికి ఉపయోగించిన ఆయుధం రాయే కాగా.. తలపై ఒకేలా కొట్టడం చూస్తుంటే, కచ్చితంగా ఒకరే రెండు హత్యలు చేసి ఉండొచ్చని పోలీసులు అంచనా వేశారు.

సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని గుర్తించారు. ఈరోజు హైదరాబాద్ లో నిందితుడిని గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.