×
Ad

Crocodile : చేపలు పడుతుంటే బాలుడ్ని లాక్కెళ్లిన మొసలి

కర్ణాటకలో విషాదం చోటు చేసుకుంది. గాలం వేసి చేపలు పడుతున్న ఓబాలుడ్ని  ముసలి లాక్కెళ్లింది. 

  • Published On : October 25, 2021 / 08:32 AM IST

Crocodile In Karnataka

Crocodile :  కర్ణాటకలో విషాదం చోటు చేసుకుంది. గాలం వేసి చేపలు పడుతున్న ఓబాలుడ్ని  ముసలి లాక్కెళ్లింది.  ఉత్తర కన్నడ జిల్లా దాండేలి తాలూకా వినాయకనగర వద్ద కాళీ నది ఒడ్డున ఆదివారం మోహీన్ మహమూద్(15) అనే బాలుడు గాలం వేసి చేపలు పడుతున్నాడు.

Also Read : Aryan Khan Drugs Case : ఆర్యన్‌ఖాన్  డ్రగ్స్ కేసు-షారుక్‌ తో రహస్య ఒప్పందం ?

ఈ క్రమంలో నదిలో నుంచి  వచ్చిన మొసలి మోహీన్ ను నదిలోకి లాక్కెళ్లింది. ఇది గమనించిన  అతని స్నేహితులు ఊళ్లో వారికి సమాచారం ఇచ్చారు. ఊళ్లోని ప్రజలు వచ్చి గాలించినా బాలుడి మృత దేహం లభ్యం కాలేదు.ఈ ఘటనతో  గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయ.