హైదరాబాద్ లోని కుషాయిగూడలో సిలిండర్ పేలుడు కలకలం రేపుతోంది.
హైదరాబాద్ : కుషాయిగూడలో సిలిండర్ పేలుడు కలకలం రేపుతోంది. సిలిండర్ పేలడంతో ఇద్దరు మృతి చెందారు. మరో 10 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. పేలుడుతో ఇరుగుపొరుగు ఇండ్లు ధ్వంసమయ్యాయి. ఇల్లు పూర్తిగా ధ్వంసం కావడమే కాదు.. చుట్టుపక్కల ఉన్న భవనాలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయంటే.. ఈ పేలుడు తీవ్రత ఎలా ఉందో తెలుస్తుంది.
బిల్డింగ్‌కు పక్కనే ఉన్న ఆస్పత్రి దగ్గర ఉన్న సీసీకెమెరాల్లో పేలుడు ధాటికి ధ్వంసమవుతున్న దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ దృశ్యాలను టెన్‌టీవీ ఎక్స్‌క్లూజివ్‌గా సేకరించింది. సిలిండర్ పేలగానే.. ఆస్పత్రిలోని గోడలు, అద్దాలు ధ్వంసమయ్యాయి. ఒక్కసారిగా ఏం జరుగుతుందో అర్థంకాక ఆస్పత్రి సిబ్బంది పరుగులు తీశారు. ఆస్పత్రిలోని ల్యాబ్‌లో టెక్నీషియన్ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు.
కుషాయిగూడలో పేలుడుతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. పేలుడు ప్రభావం చుట్టుపక్కల ఇండ్ల పై తీవ్రంగా ఉంది. పేలుడు జరిగిన ఇంటి పక్కన వారు భయంతో వణికిపోతున్నారు.. అసలు ఏం జరిగిందో తెలియక అయోమయంలో స్థానికులు ఉన్నారు.