కేరళను కదిలించింది : కూతురికి న్యాయం కోసం ఓ తండ్రి పోరాటం

గతేడాది ఆగస్టు 25న త్రిసూర్ రైల్వే స్టేషన్ నుంచి అన్ లియా అనే యువతి సడెన్ గా అదృశ్యమైపోయి ఆ తర్వాత మూడు రోజులకు అలువాలోని పెరియార్ నదిలో శవమై కన్పించిన కేసుకి సంబంధించి ఆమె తండ్రి న్యాయపోరాటం కొనసాగుతూనే ఉంది. ఎట్టకేలకు నాలుగు నెలల తర్వాత కేసులో పురోగతి కన్పించింది.

ఈ కేసులో ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోవడంతో తన కూతురికి న్యాయం జరగాలని కొన్ని రోజుల క్రితం సౌదీ అరేబియాలోని జెడ్డాలోని తన ఉద్యోగాన్ని వదిలేసి కేరళకు వచ్చాడు. కేరళ సీఎంని కలిసి తన కూతురి మృతికి కారణమైన వారిని వదిపెట్టకూడదని, నిందితులకు శిక్ష పడేలా చూడాలని కోరారు. ఈ కేసులో నిందితుడిగా అనుమానిస్తున్న అన్ లియా భర్త వివి జస్టిన్ జనవరి 19, 2019న త్రిసూర్ లోని జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు ఎదుట లొంగిపోయాడు. బుధవారం(జనవరి 23, 2019) కోర్టు అతనినిక్రైమ్ బ్రాంచ్ కస్టడీకి అప్పగించింది.

 

అయితే తన కూతురికి న్యాయం జరిగే వరకు తాను నిద్రపోననని అన్ లియా తండ్రి హైజీనస్ పారక్కల్ తెలిపారు. తాను కూతురిని కోల్పోలేదని, బెస్ట్ ఫ్రెండ్ ని కోల్పోయానని ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. తాను తన కూతురిని ఓ ఫ్రెండ్ లా చూసేవాడినని తెలిపారు.. భర్త, అత్తింటి వారి వేధింపుల కారణంగానే తన కూతురు చనిపోయిందని తెలిపారు.
 

 అన్ లియా అనుమానాస్పద మృతి తర్వాత ఆమె భర్తపై అనుమానం వ్యక్తం చేస్తూ అన్ లియా తల్లిదండ్రులు హైజీనస్ పారక్కల్, లీలమ్మలు కేసు ఫైల్ చేశారు. అన్ లియా డైరీని పోలీసులకు అందించి వారు సౌదీ అరేబియాకు వెళ్లిపోయారు. తనకేదైనా జరిగితే తన భార్త, అతని కుటుంబమే కారణమని అన్ లియా తన డైరీలో రాసుకుంది.

మరో పేజీలో అన్ లియా ఈ విధంగా రాసుకుంది.. అందరిలానే నేను కేరళకు వచ్చినప్పుడు అంతా బాగుంటుంది అనుకున్నాను. నాకు చాలా కలలు, ఆశయాలు పెళ్లికి ముందు, తర్వాత ఉన్నాయి. జస్టిన్ నా ఆశలు, ఆశయాలను అర్థం చేసుకొంటాడని అనుకుని వాటిని తీరుస్తాడు అనుకొన్నాను. పెళ్లి తర్వాత గల్ఫ్ వదిలి కేరళలోని అతడికి వచ్చిన తర్వాత జస్టిన్ నాకు 100 రూపాయలు కూడా ఇవ్వలేదు. కేవలం మా అమ్మా, నాన్న ఇచ్చిన డబ్బులతోనే బతికాను. జస్టిన్ పూర్తి వైవిధ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. పెళ్లికి ముందు అతడితో మాట్లాడినప్పుడు ఈ ప్రపంచంలోనే  అతడికన్నా బెటర్ వ్యక్తి ఇంకొకరు ఉండరు అని అనుకొన్నాను. ఇప్పుడు నా జీవితంలో దు:ఖం మాత్రమే మిగిలింది. నా జీవితంలో అలసిపోయాను..అలసిపోయాను. నేను బంటరిగా ఉన్నట్లు అనిపిస్తోంది. పెళ్లి తర్వాత అత్తింటివారు వాళ్లు ముసుగుని తొలగించారు. అంటూ అన్ లియా తన డైరీలో రాసుకొంది. అంతేకాకుండా తన అత్త ఓ పెద్ద శాడిస్ట్ అని తెలిపింది. తనకు ఏదైనా జరిగితే నిజాన్ని ఎవ్వరూ బయటికి చెప్పరని, ఏదైనా జరగరానిది జరిగితే అత్తింటి వారే కారణమని ఆ డైరీలో రాసుకుంది.

మాట్రిమోనియల్ సైట్ ద్వారా జస్టిన్, అన్ లియాల వివాహాం కుదిరింది. జస్టిన్ నుంచి 2015లో పెళ్లి ప్రపోజల్ రాకముందు జెడ్డా నేషనల్ హాస్పిటల్ లో స్టాఫ్ నర్సుగా అన్ లియా పనిచేసేదని, డిసెంబర్ 26, 2016లో అన్ లియా-జస్టిన్ ల వివాహం జరిగిందని, పెళ్ల నాటికి అన్ లియా వయస్సు కేవలం 23 సంవత్సరాలేనని, దుబాయ్ లో ఉండే భర్త కోసం సౌదీ అరేబియాలో తన ఉద్యోగానికి రాజీనామా చేసిందని, పెళ్లి అయిన తర్వాత..దుబాయ్ లో ఉద్యోగం కోసం జస్టిన్ నకిలీ సర్టిఫికెట్లు సమర్పించాడని తెలిసి అతనిని ఉద్యోగంలో నుంచి తీసివేయడంతో 2017లో సొంతూరు కేరళకు అన్ లియాను జస్టిన్ తీసుకెళ్లాడని ఆమె తండ్రి హైజీనస్ పారక్కల్  తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు