హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఓ జింక మృతి చెందింది.
హైదరాబాద్ : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఓ జింక మృతి చెందింది. బుల్లెట్ గాయాలతో మృతి చెందినట్లుగా విద్యార్థులు గుర్తించారు. ఫారెస్టు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు జింక మృతదేహం పడి ఉన్న ప్రదేశాన్ని పరిలీశించారు. జింక శరీరంలో బుల్లెట్లను గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. ఎవరో వేటాడారని నిర్ధారణకు వచ్చారు. అక్కడ పడిన బుల్లెట్ల ఆధారంగా వేటాడి గన్ తో ఫైర్ చేసినట్లుగా ఫారెస్టు అధికారులు అంచనాకు వచ్చారు.
పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పోస్టుమార్టం రిపోర్టు అధారంగా కూడా దర్యాప్తు చేయనున్నారు. గతంలోనూ రెండు సార్లు హెచ్ సీయూలో జింకను వేటాడిన ఘటనలు ఉన్నాయి. ఇది మూడో ఘటన. అయితే వాటికి సంబంధించిన వివరాలు ఇప్పటివరకు అధికారుల వద్ద లేకపోవడం గమనార్హం.
Read Also : సమ్మర్ స్పెషల్ : సికింద్రాబాద్ కాకినాడల మధ్య 2 ప్రత్యేక రైళ్లు