ఈ నేరానికి శిక్షేంటి..? : ఉన్నావ్ తీర్పుపై ఉత్కంఠ

  • Publish Date - December 16, 2019 / 12:58 AM IST

అత్యాచారం చేయడమే కాకుండా..అంతం చేయాలని చూసే రాక్షసులకు ఎలాంటి శిక్ష పడాలి..దిశ కేసులో జరిగిన న్యాయం కంటే ఇప్పుడు అలాంటి కేసులలో కోర్టులెలా వ్యవహరించబోతున్నాయనే అంశం ఆసక్తి కలిగిస్తోంది. అలాంటివాటిలో ఉత్తరప్రదేశ్‌లో సంచలనం కలిగించిన ఉన్నావ్‌ అత్యాచారం కేసు కూడా ఒకటి. ఉత్తరప్రదేశ్‌లో సంచలనం కలిగించిన ఉన్నావ్‌ అత్యాచారం కేసులో తుది తీర్పు 2019, డిసెంబర్ 16వ తేదీ సోమవారం వెలువడనుంది.

2017, జూన్ 04వ తేదీన ఈ ఘటన చోటు చేసుకుంది. సెప్టెంబర్ 7న కోర్టు విచారణ పూర్తవగా..డిసెంబర్ 16కు ఫైనల్ జడ్జిమెంట్ రిజర్వ్ అయింది..ప్రస్తుతం దేశవ్యాప్తంగా మహిళలపై అత్యాచారాలపై నిరసనలు తారస్థాయికి చేరిన నేపధ్యంలో వెలువడే తొలి తీర్పు ఇదే కావచ్చు. ఆరోపణలు ఎదుర్కొంటోన్న ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగర్‌కి అధికారపక్షం మద్దతు పలకడం విమర్శలకు తావిస్తోంది..బిజెపి ఎంపి సాక్షి మహారాజ్ బాహాటంగానే కుల్దీప్ సెంగర్‌ని చూడటానికి జైలుకి వెళ్లడం..ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా చెప్పారు..ఈ నేపధ్యంలోనే ఇప్పుడు కోర్టు కుల్దీప్ సింగ్ సెంగర్‌కి ఎలాంటి శిక్ష విధిస్తుందనేది ఉత్కంఠ కలిగిస్తోంది.

అసలేం జరిగింది : – 
రెండున్నరేళ్ల క్రితం ఉద్యోగం కోసం తన దగ్గరకు వచ్చిన యువతిపై ఎమ్మెల్యే కుల్దీప్ సెంగర్ అత్యాచారానికి పాల్డడ్డారంటూ ఆరోపణలు వచ్చాయి. 
2017, జూన్ 4న జరిగిన ఈ ఘటనపై కేసుని స్వీకరించేందుకు స్థానిక పోలీసులు నిరాకరించడంతో అప్పట్లో బాధితురాలు యూపీ సీఎం నివాసం వద్ద కుటుంబసభ్యులతో సహా ఆత్మహత్యాయత్నం చేసింది. 
యూపి సర్కారు స్పందించింది. 
కానీ బాధితురాలి కుటుంబసభ్యులు ఒక్కొక్కరే అనుమానాస్పద స్థితిలో మరణించారు. 
యువతి తండ్రిపై తప్పుడు కేసు నమోదవగా ఆయన పోలీస్ స్టేషన్‌లోనే చనిపోయారు. 
కేసు విచారణ జరుగుతున్న తీరుపై దేశవ్యాప్తంగా విమర్శలు వచ్చాయి. 
ఈ కేసు దర్యాప్తుని సీబీఐ చేపట్టింది. 
ఎమ్మెల్యే కుల్దీప్ సెంగర్ అతని సోదరుడి శశిసింగ్‌ని అరెస్ట్ చేసింది.
 

ఆ తర్వాత బాధితురాలు తన బంధువులతో కలిసి కోర్టుకు హాజరవుతుండగా యాక్సిడెంట్‌కి లోనైంది. 
ప్రమాదంలో బాధితురాలి బంధువులైన ఇద్దరు మహిళలు చనిపోయారు. 
బాధిత యువతితో పాటు ఆమె తరపు లాయర్ కూడా తీవ్రంగా గాయపడి ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. 
ఈ ప్రమాదం వెనుక కూడా ఎమ్మెల్యే బంధువుల పాత్ర ఉందని బాధితురాలు ఆరోపించింది. 
సుప్రీంకోర్టుకూ లేఖ రాసింది. 
ఢిల్లీ హైకోర్టు ఆదేశాలతో ఆమెకి స్థానిక పోలీసులే ఓ నివాసం ఏర్పాటు చేశారు.
ప్రస్తుతం ఎలాంటి తీర్పు వెలువడనుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. 
Read More : Citizenship Act : సౌత్ ఈస్ట్ ఢిల్లీలో స్కూళ్లకు సెలవులు