ఢిల్లీ వ్యక్తికి తెలుగు హీరోయిన్ అంటే పిచ్చి. అక్కడితో ఆగలేదు.. అసభ్యకర మెసేజ్‌లు పంపాడు… చివరకు జైలుపాలయ్యాడు!

  • Publish Date - August 10, 2020 / 08:32 PM IST

ఆ ఢిల్లీ వ్యక్తికి తెలుగు హీరోయిన్ అంటే ఎంతో పిచ్చి.. అక్కడితో ఆగలేదు.. అసభ్యకర మెసేజ్ లు పంపుతూ సైకోలా ప్రవర్తించాడు.. చివరికి కటకటల పాలయ్యాడు.. బాధిత నటి ఫిర్యాదు మేరకు 26ఏళ్ల ఢిల్లీ వ్యక్తిని రోహిణిలోని తన నివాసంలో పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు సదరు నటికి అసభ్యకరమైన సందేశాలు పంపించాడని, తుపాకీ ఫొటోలతో బెదిరించాడని ఫిర్యాదులో తెలిపింది.

జార్ఖండ్‌కు చెందిన నిఖిల్ గంగ్వార్‌గా అనే వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. గురుగ్రామ్ పక్కనే ఉన్న ఒక ప్రైవేట్ కంపెనీలో ఫార్మసిస్ట్‌గా పనిచేస్తున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. తెలుగు హీరోయిన్ అంటే అతడికి ఎంతో పిచ్చి.. సోషల్ మీడియాలో తనను పెళ్లి చేసుకోవాలని ఆమెను పదేపదే వేధించేవాడు.. అతడి మాటలను పట్టించుకోలేదని కోపంతో ఆమెకు అసభ్యకరంగా సందేశాలు పంపి వేధించసాగాడు.



2016లో గంగ్వార్ నటిని అభిమానిగా పరిచయం పెంచుకున్నాడని ఒక పోలీసు అధికారి తెలిపారు. ఒక ఏడాది క్రితం, అసభ్యకరమైన మెసేజ్ లను పంపుతున్నాడు.. శారీరకంగా ఆమెపై బెదిరింపులకు పాల్పడుతున్నాడు. తన పెళ్లి ప్రపోజల్ అంగీకరించలేదని ఆగ్రహంతో ఆమెపై అసభ్యకర పదజాలంతో మెసేజ్ లు పెడుతున్నాడు. దాంతో బాధిత నటి అతడి సోషల్ అకౌంట్ బ్లాక్ చేసింది. నిందితుడు నకిలీ ప్రొఫైల్స్ క్రియేట్ చేశాడు.. ఆ సోషల్ అకౌంట్లు అన్నీ ఒకే వ్యక్తి వాడుతున్నాడని పోలీసుల విచారణలో తేలింది. మార్చి నుంచి ఆమె తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది.



ఢిల్లీలో ఆమె చిరునామాను ట్రాక్ చేసినట్లు నిందితుడు ఇటీవల సోషల్ మీడియాలో తెలిపాడు. ఆమె కుటుంబం ఢిల్లీలో నివసిస్తుంది. నిందితుడు ఆమె ఇంటి ఫోటోలను రుజువుగా పంపించాడు. గత నెలలోనే పోలీసులను సంప్రదించిన నటి అతనిపై ఫిర్యాదు చేసింది. నటి ఫిర్యాదు ఆధారంగా రోహిణి (నార్త్) పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

నిందితుడి సోషల్ అకౌంట్లను సేకరించారు. అతడు ఏ ఐపీ అడ్రస్ నుంచి ఇలాంటి చేస్తున్నాడో ఆయా వివరాలను సేకరించారు. రోహిణిలోని అతడి నివాసానికి ట్రాక్ చేసి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.