తన కొడుకును చంపి ఏం సాధించారు ? తాము నివాసం ఉంటున్న పక్కనే ఆందోళనలు జరుగుతున్నాయి..నా కొడుకుతో పాటు..ముగ్గురిని ఎత్తుకెళ్లారు..ఇలా చేస్తారా ? నా కొడుకును ఇవ్వండి..ఇంత దారుణంగా చంపేస్తారా ? ప్రశ్నిస్తోంది యంగ్ ఐబీ సెక్యూర్టీ అసిస్టెంట్ అంకిత్ శర్మ తల్లి. ఢిల్లీలో జరిగిన ఘర్షణలో అంకిత్ శర్మను అత్యంత దారుణంగా హత్య చేశారు. ఖజూరి చాంద్ బాగ్ నాలాలో దొరికిన మూడు మృతదేహాల్లో అంకిత్ శర్మది కూడా లభ్యమైంది. దీనిపై 10tv అంకిత్ శర్మ కుటుంబసభ్యులను కలిసింది. తీవ్ర విషాదంలో ఉన్న ఆయన తల్లి, సోదరి మాట్లాడారు.
తన కొడుకు ఎక్కడో చెప్పాలని తాను అందరినీ అడిగినట్లు తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారని తాను ఖజూరీ పీఎస్‌లో తాను ఫిర్యాదు చేయడానికి వెళితే..తీసుకోలేదని తెలిపారు. గోకుల్ పూర్ పీఎస్‌కు వెళ్లినట్లు వెల్లడించారు. తన కొడుకు ఎంతో ధైర్యవంతుడని, చాలా మంచి వ్యక్తి అని కళ్లనీళ్లు పెట్టుకుంటూ చెప్పారు.
Read More>>ఢిల్లీలో ఘర్షణలు : ఐబీ ఆఫీసర్ కళ్లు పీకేసి..గొంతు కోశారు
తాము ముస్లింలను చంపేశామా ? లేదు కదా.. ఇలా ఎవరైనా ఆందోళనలు, నిరసనలు చేస్తారా ? ఘర్షణలో తాము చాలా మందికి సహాయం చేశాం..దేశంలో ఉంటూ..తమ పక్కనే ఉంటూ..చంపేస్తారా ? పాకిస్తాన్ తరహా అల్లర్లు చేస్తున్నారు..మంచిగా ఉంటే..ఉండండి..లేకపోతే వెళ్లిపోండి..అంటూ తెలిపారు అంకిత్ శర్మ సోదరి.
అంకిత్ శర్మ ప్రాణాలు తీయడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమౌతోంది. ఇలాంటి చర్యలు పునరావృతం కావొద్దని, నిందితులకు కఠినంగా శిక్షించాలని డిమాండ్స్ చేస్తున్నారు. మొత్తంగా ఢిల్లీలో జరిగిన అల్లర్లలో 22 మంది చనిపోయారు.
Such a tragic loss of life. The culprits must not be spared. 20 people have already lost their lives. So painful to watch people of Delhi suffering
Praying that we recover from this tragedy soon n work together to undo damage done to people n communities https://t.co/5iYR5jiNbu
— Arvind Kejriwal (@ArvindKejriwal) February 26, 2020