ఢిల్లీలో దారుణం జరిగింది.షాలీమర్ బాగ్ ఏరియాలో ఓ వ్యాపారవేత్త తన ఇద్దరు పిల్లలను చంపి మొట్రో రైలు ముందు పడి ఆత్మహత్య చేసుకున్నాడు. కొంతకాలంగా డిఫ్రెషన్ తో ఆ వ్యాపారవేత్త భాధపడుతున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఆరు నెలల క్రితం నష్టాల కారణంగా అతను తన సాండ్ పెప్పర్ ఫ్యాక్టరీని మూసివేశాడని,అప్పటినుంచి ఏ పనీ లేకుండా ఖాళీగా ఉన్నాడని పోలీసులు తెలిపారు. ఫ్యాక్టరీ మూసివేసినప్పటినుంచి తల్లిదండ్రులు అతడికి ఆర్థికంగా అండగా నిలబడ్డారని,బిజినెన్ పున:ప్రారంభించాలని ప్రయత్నాలు చేస్తున్నాడని,ఈ సమయంలోనే డిప్రుషన్ తో ఇలా చేశాడని పోలీసులు తెలిపారు.
ఆదివారం సాయంత్రం 6:54గంటల సమయంలో తమకు ఓ ఎమర్జెన్సీ కాల్ వచ్చిందని,షాలిమర్ ఏరియాలో ఓ చిన్నారిలో వాళ్ల ఇంట్లో హత్యకు గురైందని ఫోన్ లో చెప్పారని,వెంటనే ఆ బిల్డింగ్ లోకి వెళ్లామని,ఇద్దరు పిల్లల మృతదేహాలు బెడ్ పై పడి ఉన్నాయని పోలీసులు తెలిపారు. మృతులను 14ఏళ్ల సమీక్ష,6ఏళ్ల శ్రేయాన్స్ గా గుర్తించామన్నారు.
అయితే ఆ సమయంలో పిల్లల తండ్రి 44ఏళ్ల మధుర్ మలానీ మిస్ అయినట్లు గుర్తించామని,ఆ తర్వాత ఆయన మెట్రో స్టేషన్ దగ్గర ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసిందని పోలీసులు తెలిపారు. మలానీ ఇంట్లో గానీ,ఆయన జేబులో గానీ ఎలాంటి సూసైడ్ నోట్ లేదని పోలీసులు తెలిపారు. మలానీ భార్య రూపాలి మాట్లాడుతూ…మార్కెట్ వెళ్ళడానికి ఇంటి నుండి బయలుదేరాను. తిరిగివచ్చేసరికి పిల్లలు చనిపోయారని, భర్త కనిపించలేదని ఆమె పోలీసులకు తెలిపింది, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నార్త్ వెస్ట్ డీసీపీ విజయంత ఆర్య తెలిపారు.