ఒకరి తర్వాత ఒకరు : ప్రియాంక కేసు రిమాండ్ రిపోర్టు విషయాలు తెలిస్తే కన్నీళ్లు ఆగవు

రిమాండ్‌ రిపోర్ట్‌లోని విషయాలు చూస్తే... ఎవరికైనా కన్నీళ్లొస్తాయి. ఆ నీచులు చేసిన పని ఆక్రోశాన్ని తెప్పిస్తుంది. అసలు నిందితులు ఇంత దారుణానికి ఎలా తెగబడ్డారు...? ఇంత

  • Publish Date - December 1, 2019 / 05:15 AM IST

రిమాండ్‌ రిపోర్ట్‌లోని విషయాలు చూస్తే… ఎవరికైనా కన్నీళ్లొస్తాయి. ఆ నీచులు చేసిన పని ఆక్రోశాన్ని తెప్పిస్తుంది. అసలు నిందితులు ఇంత దారుణానికి ఎలా తెగబడ్డారు…? ఇంత

రిమాండ్‌ రిపోర్ట్‌లోని విషయాలు చూస్తే… ఎవరికైనా కన్నీళ్లొస్తాయి. ఆ నీచులు చేసిన పని ఆక్రోశాన్ని తెప్పిస్తుంది. అసలు నిందితులు ఇంత దారుణానికి ఎలా తెగబడ్డారు…? ఇంత ధైర్యం వారికి ఎక్కడి నుంచి వచ్చింది…? ఈ దుర్భుద్దికి మూల కారకుడెవరు…? ప్రియాంకను ట్రాప్‌ చేయాలన్న ఆలోచన మొదట ఎవరికొచ్చింది…? ఇలాంటి అనుమానాలకు రిపోర్ట్‌ క్లారిటీ ఇచ్చేసింది.  

నిందితులు మహ్మద్‌, జొల్లు శివ నవంబర్‌ 21న బూర్గుల గ్రామం నుంచి ఇనుప కడ్డీలు తీసుకుని వెళ్లి కర్ణాటకలోని రాయచూర్‌లో అన్‌లోడ్‌ చేశారు. అనంతరం లారీ యజమాని సూచనలతో నవంబర్‌ 24న గంగావతికి వెళ్లి ఇటుకలు లోడ్‌ చేసుకొని హైదరాబాద్‌ బయలుదేరారు. వచ్చేదారిలో నవీన్, చెన్నకేశవులు గుడిగండ్ల గ్రామంలో కలిశారు. అదే గ్రామంలో పొదల్లో ఉన్న ఐరన్‌ చానల్స్‌ను లోడ్‌ చేసుకుని తీసుకొస్తుండగా 26న మహబూబ్‌నగర్‌ ఆర్టీఓ లారీని ఆపి తనిఖీలు చేశారు. మహ్మద్‌కు డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేదని, పైగా లారీ ఓవర్‌ లోడ్‌తో ఉందని గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆర్టీఓకు లారీ అప్పగించి రావొద్దంటూ యజమాని స్పష్టం చేయడంతో మహ్మద్‌.. లారీ స్టార్ట్‌ కాకుండా చేసేందుకు సెల్ఫ్‌ స్టార్ట్‌ వైర్‌ పీకేశాడు. దీంతో ఆర్టీఓ లారీని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. అక్కడి నుంచి బయలుదేరి మార్గమధ్యంలో రాయ్‌కల్‌ టోల్‌ ప్లాజా దగ్గర ఇనుప కడ్డీలను అక్రమంగా విక్రయించిన నిందితులు రూ.4 వేలు సంపాదించారు. 

అనంతరం తొండుపల్లి వచ్చి అక్కడే లారీ కేబిన్‌లో నిద్రపోయారు. 27న ఉదయం 9 గంటలకు పోలీసు పెట్రోలింగ్‌ వాహనం వచ్చి అక్కడి నుంచి లారీని తీసేయాలని హెచ్చరించడంతో.. సమీప దూరంలోని ఓఆర్‌ఆర్‌ సర్వీసు రోడ్డులోకి లారీని తీసుకెళ్లి అక్కడ నిలిపి ఉంచారు. సాయంత్రం 5.30 గంటల సమయంలో మద్యం కొనుగోలు చేసి, కేబిన్‌లోనే తాగుతూ కూర్చున్నారు. ఆ సమయంలో లారీ పక్కనే స్కూటీ పార్క్‌ చేస్తున్న ప్రియాంకారెడ్డిని చూశారు. ఆమె అందంగా ఉందని, స్కూటీ కోసం తిరిగి వచ్చినప్పుడు ఆమెపై అత్యాచారం చేయాలని నిందితులు కుట్ర పన్నారు. ఈ దుర్భుద్దికి మూల కారకుడు చెన్నకేశవులేనని రిపోర్ట్‌లో తేలింది.

పథకం ప్రకారం స్కూటీ వెనుక టైర్‌ను నవీన్‌ పంక్చర్‌ చేశాడు. అప్పటికే ఫుల్‌ బాటిల్‌ మద్యం తాగిన నిందితులు మరో హాఫ్‌ బాటిల్‌ తెచ్చుకుని తాగుతూ కూర్చున్నారు. రాత్రి 9.30 గంటల సమయంలో ప్రియాంక రావడాన్ని గమనించారు. మహ్మద్, చెన్నకేశవులు ఆమె దగ్గరికి వెళ్లి.. మేడమ్, మీ స్కూటీ టైర్‌ పంక్చర్‌ అయిందని చెప్పి మాట కలిపారు. వారి వాలకం చూసిన ప్రియాంక స్పందించ లేదు. కానీ నిందితులు ఆమెకు సాయం చేస్తున్నట్టు నటించారు. స్కూటీ టైర్‌లో గాలి నింపుకొని తీసుకురావాలని మహ్మద్‌.. శివను పంపించాడు. మహ్మద్‌ మాట్లాడుతుండగానే ప్రియాంక తన చెల్లికి ఫోన్‌ చేసి లారీ డ్రైవర్లను చూస్తుంటే భయమేస్తోందని చెప్పింది. కొద్దిసేపటికి షాప్‌ మూసి ఉందంటూ శివ తిరిగి వచ్చాడు.

మరో షాప్‌లో గాలి నింపుకొని వస్తానంటూ శివ మళ్లీ బండి తీసుకుని వెళ్లాడు. అతడు గాలి నింపుకొని తిరిగి వచ్చిన వెంటనే నిందితులు తమ పథకాన్ని అమలు చేశారు. మహ్మద్‌ ప్రియాంక చేతులు పట్టుకోగా.. చెన్నకేశవులు ఆమె కాళ్లు, నవీన్‌ నడుము పట్టుకుని ప్రహరీ గోడ లోపలున్న చెట్ల పొదల్లోకి బలవంతంగా ఎత్తుకెళ్లారు. ఆ సమయంలో ఆమె హెల్ప్‌.. హెల్ప్‌ అంటూ ఆర్తనాదాలు చేసినా నిందితులు కనికరించలేదు. అరుపులు బయటకు వినిపించకుండా మహ్మద్‌ ఆమె నోటిని తన చేతితో మూసివేశాడు. వెంటనే నవీన్‌ ఆమె సెల్‌ఫోన్‌ను స్విచ్చాఫ్‌ చేశాడు. శివ ఆమె దుస్తులను లాగేశాడు. దీంతో మళ్లీ హెల్ప్‌.. హెల్ప్‌ అని అరవడంతో నవీన్, చెన్నకేశవులు ప్రియాంక నోట్లో మద్యం పోశారు. అనంతరం ఒకరి తర్వాత ఒకరు పాశవికంగా అత్యాచారం చేశారు. దీంతో తీవ్ర రక్తస్రావం జరిగి ప్రియాంక స్పృహ కోల్పోయింది. కొంతసేపటికి స్పృహ రావడంతో నిందితులు ఆమెను చంపాలని నిర్ణయించుకున్నారు. 

మహ్మద్‌ ఆమె నోరు, ముక్కును చేతులతో గట్టిగా అదిమి పట్టడంతో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయింది. నవీన్‌ ఆమె సెల్‌ఫోన్, పవర్‌ బ్యాంక్, వాచీలను కవర్‌లో పెట్టి లారీలో ఉంచాడు. అనంతరం ఓ బెడ్‌షీట్‌లో మృతదేహాన్ని చుట్టి లారీలో పడేశారు. అక్కడి నుంచి నవీన్, శివ స్కూటీపై… మహ్మద్‌, చెన్నకేశవులు లారీలో షాద్‌నగర్‌ వైపు రాత్రి 11 గంటలకు బయలుదేరారు. నవీన్, శివ బాటిల్‌ తీసుకుని పెట్రోల్‌ కోసం కొత్తూరు శివారులోని బంకుకు వెళ్లారు. అయితే, వారిపై అనుమానం వచ్చిన బంక్‌ ఉద్యోగి లింగరామ్‌ గౌడ్‌ బాటిల్ లో పెట్రోల్‌ పోయడానికి నిరాకరించాడు. దీంతో దగ్గరలో ఉన్న ఐవోసీ పెట్రోల్‌ బంక్‌లో నిందితులిద్దరూ పెట్రోల్‌ కొనుగోలు చేశారు. షాద్‌నగర్‌ సమీపంలోని చటాన్‌పల్లి అండర్‌పాస్‌ దగ్గరికి అందరూ చేరుకున్నారు. మృతదేహాన్ని లారీ నుంచి దింపి అండర్‌పాస్‌ కిందికి తీసుకెళ్లి పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. ఆ తర్వాత ప్రియాంక సిమ్‌కార్డులు, బ్యాగ్‌ను అదే మంటల్లో వేసి కాల్చేశారు. అనంతరం అక్కడి నుంచి ఆరాంఘర్‌ వైపు వెళ్లిపోయారు రాక్షసులు. ఇలా ఓ పథకం ప్రకారం నీచానికి ఒడిగట్టారు. ప్రియాంక హత్యతో దేశాన్ని వందేళ్లు వెనక్కి నెట్టారు. ఇక ఈ క్రూరమృగాలకు 14 రోజుల రిమాండ్ విధించారు.