చేయి కొరికింది.. మెడపై రక్కింది : మద్యం మత్తులో పోలీసులకు చుక్కలు చూపించింది

హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో శనివారం(నవంబర్ 16,2019) ఓ మహిళ రచ్చ రచ్చ చేసింది. పోలీసులకే చుక్కలు చూపించింది. మద్యం మత్తులో వీరంగం సృష్టించింది.

  • Publish Date - November 17, 2019 / 02:47 AM IST

హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో శనివారం(నవంబర్ 16,2019) ఓ మహిళ రచ్చ రచ్చ చేసింది. పోలీసులకే చుక్కలు చూపించింది. మద్యం మత్తులో వీరంగం సృష్టించింది.

హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో శనివారం(నవంబర్ 16,2019) ఓ మహిళ రచ్చ రచ్చ చేసింది. పోలీసులకే చుక్కలు చూపించింది. మద్యం మత్తులో వీరంగం సృష్టించింది. మహిళా ఎస్ఐతో పాటు కానిస్టేబుళ్లపైనా దాడి చేసింది. ఓ కానిస్టేబుల్ చేయి కొరికొంది.. మరో కానిస్టేబుల్ మెడపై రక్కింది. దీంతో పోలీసులు బెంబేలెత్తిపోయారు.

వివరాల్లోకి వెళితే బంజారాహిల్స్ జహీరానగర్ లో లీసా అనే మహిళ మద్యం మత్తులో రోడ్డుపై పడి ఉంది. ఆమెని గుర్తించిన బంజారాహిల్స్ పోలీసులు పీఎస్ కు తీసుకొచ్చారు. కాసేపటికి తేరుకున్న లీసా.. పోలీసులతో గొడవకు దిగింది. నన్నెందుకు తీసుకొచ్చారని వారితో వాగ్వాదానికి దిగింది. అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించింది. మహిళా ఎస్ఐ, ముగ్గురు మహిళా కానిస్టేబుళ్లు లీసాని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. అంతే లీసా రెచ్చిపోయింది. వారిని బూతులు తిట్టింది. ఓ కానిస్టేబుల్ చేతిని కొరికింది. మరో కానిస్టేబుల్ మెడపై రక్కింది. మీ అంతు చూస్తా అంటూ పోలీసులకే వార్నింగ్ ఇచ్చింది లీసా.

తంటాలు పడిన పోలీసులు.. ఎలాగో ఆమెను కంట్రోల్ చేయగలిగారు. తన పేరు లీసా అని తనది నాగాలాండ్ అని చెప్పింది. మాదాపూర్ లో పని చేస్తున్నట్లు వెల్లడించింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. లీసా మద్యం మత్తులో ఉందా లేక మాదకద్రవ్యాలు తీసుకుందా అనేది తెలుసుకునే పనిలో ఉన్నారు.