శరీరంపై రక్తపు మరకలు : చిన్నారి ద్వారక హత్యలో కొత్త కోణం

ఏపీలో సంచలనం సృష్టించిన భవానీపురం చిన్నారి ద్వారక హత్య కేసులో పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో కొత్త కోణం బయటపడింది.

  • Published By: veegamteam ,Published On : November 12, 2019 / 05:29 AM IST
శరీరంపై రక్తపు మరకలు : చిన్నారి ద్వారక హత్యలో కొత్త కోణం

Updated On : November 12, 2019 / 5:29 AM IST

ఏపీలో సంచలనం సృష్టించిన భవానీపురం చిన్నారి ద్వారక హత్య కేసులో పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో కొత్త కోణం బయటపడింది.

ఏపీలో సంచలనం సృష్టించిన భవానీపురం చిన్నారి ద్వారక హత్య కేసులో పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కొత్త కోణం బయటపడింది. చిన్నారి ద్వారకను నిందితుడు ప్రకాశ్ అత్యాచారం చేసినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. బాలిక ప్రైవేట్ భాగాల్లో రక్తం మరకలు గుర్తించారు. అత్యాచారం జరిగి ఉండొచ్చని సందేహిస్తున్నారు పోలీసులు.

నిందితుడు ప్రకాశ్ కు నేర చరిత్ర ఉంది. కొన్నేళ్ల క్రితం మూగ బాలికపై అత్యాచారం చేశాడు. ఈ కేసులో 11 నెలలు జైల్లో ఉండి వచ్చాడు. అతడిపై పోలీసులకు అనుమానాలు పెరిగాయి.

ద్వారక హత్య కేసులో తల్లి పాత్ర కూడా ఉన్నట్లు పోలీసులు తేల్చారు. నవంబర్ 10న నల్లకుంటలో అదృశ్యమైన ద్వారక.. ఆ తర్వాత హత్యకు గురైంది. ద్వారక పక్కింట్లో ఉంటున్న ప్రకాశ్ నివాసంలో మృతదేహం కనిపించింది. తన ప్రియుడితో రాసలీలలను చూసిన ద్వారక.. ఆ విషయాన్ని ఎక్కడ బటయపెడుతుందోనని ప్రియుడు ప్రకాశ్ తో కలిసి కూతురిని చంపినట్టు పోలీసుల విచారణలో బయటపడింది.

ఈ కేసులో ద్వారక తల్లిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. సోమవారం(నవంబర్ 11,2019) అర్థరాత్రి వరకు విచారించారు. నిందితుడు ప్రకాశ్ ను కూడా విచారిస్తున్నారు.

మొవ్వ అనిల్‌, వెంకట రమణ భార్యాభర్తలు. అనిల్‌ ప్రభుత్వ మద్యం సరఫరా గోదాంలో పనిచేస్తుండగా.. వెంకటరమణ సమీపంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో స్వీపర్‌గా పని చేస్తోంది. ఇద్దరు అబ్బాయిలను నందిగామ మండలం గోళ్లమూడిలో బంధువుల ఇంటి దగ్గర ఉంచి చదివిస్తున్నారు. ఎనిమిదేళ్ల కుమార్తె ద్వారక మాత్రం తల్లిదండ్రులతోనే ఉంటోంది. స్థానిక స్కూల్ లో 2వ తరగతి చదువుతోంది. వీరి పక్కింట్లో పెంటయ్య అలియాస్‌ ప్రకాష్‌ తన భార్యతో కలిసి అద్దెకు ఉంటున్నాడు. 

ఆదివారం(నవంబర్ 11,2019) ప్రకాశ్ భార్య బయటకు వెళ్లింది. అదే సమయంలో టీవీ చూసేందుకు ద్వారక.. పెంటయ్య ఇంటికి వెళ్లింది. అక్కడ తన తల్లి వెంకటరమణ, పెంటయ్య సన్నిహితంగా ఉండటాన్ని చూసింది. ఈ విషయమై తల్లిని నిలదీసింది. నాన్నకు చెబుతానంది. కంగారు పడిన వెంకటరమణ.. నువ్వే ఏదో ఒకటి చెయ్‌ అని పెంటయ్యకు చెప్పి హడావుడిగా బయటకు వెళ్లిపోయింది. దీంతో ప్రకాశ్.. ద్వారకను హత్య చేశాడని, మృతదేహాన్ని బయటకు తరలించే అవకాశం లేకపోవడంతో సంచిలో మూటగట్టి బీరువా చాటున దాచాడని పోలీసులు తెలిపారు.