విశాఖపట్నంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మాజీ మంత్రి కన్నుమూశారు. జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి బలిరెడ్డి సత్యారావు శుక్రవారం సాయంత్రం మరణించారు. సాయంత్రం బీచ్ రోడ్డులో వాకింగ్ చేస్తుండగా ఆయన్ను బైక్ ఢీ కొట్టింది. దీంతో ఆయన కిందపడ్డారు.
కింద పడటంతో ఆయన తలకు బలమైన గాయమైంది. వెంటనే స్దానికులు దగ్గరలో ఉన్న ఒక ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. కాగా ఆస్పత్రిలో డాక్టర్లు ఆయనకు చికిత్స అందించినప్పటికీ ప్రయోజనం లేక పోయింది. తలకు గాయం కావటంతో చివరకు ఆయన తుది శ్వాస విడిచారు. బలిరెడ్డి రెండు సార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పని చేసారు. 1989, 1999 లో చోడవరం నియోజక వర్గం నుంచి ఆయన గెలుపొందారు. మంత్రిగా కూడా పని చేసిన సూర్యారావు అప్పట్లో విశాఖలో కీలక నేతగా ఉన్నారు.
2004 లో చోడవరం నుంచి పోటీ చేసి గంటా శ్రీనివాసరావు చేతిలో ఓడిపోయారు. అనంతరం రాజకీయాలకు కాస్త దూరంగా ఉన్నారు. 2013 మేలో ఆయన వైసీపీ లో చేరారు. చోడవరం నియోజక వర్గంలో సీనియర్ నేతగా వ్యవహరిస్తున్నారు.