పెళ్లైన వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుని ఆ వ్యక్తి తనకే చెందాలనే కోరిక పెరిగి పోవటంతో ఓ కుటుంబం రోడ్డు పాలయ్యింది. ఇద్దరు చిన్నారులు అనాధలవ్వగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
కర్ణాటకలోని చిక్ మగుళూరు జిల్లా కడూరులో డాక్టర్. రేవంత్ డెంటల్ డాక్టర్ గా ప్రాక్టీస్ చేస్తున్నాడు. అతనికి ఉడుపి పట్టణంలోని లక్ష్మీనగరకు చెందిన బసవరాజప్ప కుమార్తె కవితతో 7 ఏళ్ల క్రితం వివాహం అయ్యింది. వీరికి ఆరు నెలల చిన్నారితో పాటు 5 ఏళ్ల కొడుకు ఉన్నాడు.
రేవంత్ కు బెంగుళూరు రాజేశ్వరినగర జవరేగౌడ లేఅవుట్ లోనివాసం ఉండే ఫ్యాషన్ డిజైనర్ హర్షిత తో పరిచయం అయ్యింది. ఈ పరిచయం క్రమేపి వివాహేతర సంబంధం గా మారింది. వీరి పరిచయం ఎంతలా పెరిగిందంటే రేవంత్ ను చూడకుండా హర్షిత ఉండలేనంతగా…. హర్షిత ఎంతసేపు రేవంత్ తనకే చెందాలని…. తన వద్దకు వచ్చేయాలని అతడిపై ఒత్తిడి చేయసాగింది
ఈ క్రమంలో ఫిభ్రవరి 17న డాక్టర్ రేవంత్ భార్య కవిత అనుమానాస్పద స్ధితిలో మరణించింది. తన భార్యను ఎవరో హత్య చేశారని….ఇంట్లో నగలు పోయాయని కడూరు పోలీసులకు రేవంత్ ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ మొదలెట్టారు.
పోలీసులు మొదట రేవంత్ ను అనుమానించలేదు. శవాన్ని పోస్టు మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. నగల కోసమే ఎవరో కవితను హత్య చేసిఉంటారనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఆ ప్రాంతంలోని అన్నిసీసీ టీవీ కెమెరాల ఫుటేజి పరిశీలించారు. కవిత హత్యకు గురైన రోజు ఆ ఏరియాలో ఎవరూ అనుమానాస్పదంగా తిరిగిన దాఖలాలు కనిపించలేదు.
ఈలోగా ఫిబ్రవరి 20వతేదీ గురువారం పోస్టుమార్టం నివేదిక పోలీసులకు చేరింది. అందులో కవితకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి గొంతు నులిమి చంపినట్లు తేలింది. దీంతో రేవంత్ ను విచారించాలని పోలీసులు నిర్ణయించుకుని అతడి ఫోన్ కాల్స్ లిస్ట్ తెప్పించుకున్నారు. అతని ఫోన్ కాల్స్ లిస్టులో ఉన్న నంబర్లను పరిశీలించసాగారు. ఫోన్ కాల్ లిస్టు పోలీసులు వెరిఫై చేస్తున్న సంగతి ఫ్యాషన్ డిజైనర్ హర్షితకు కూడా చెప్పాడు.
హర్షితను చంపటానికి రేవంత్ సూపర్ స్కెచ్ వేశాడు. కవితను హత్య చేసిన రోజు ఆమెను బంగారం షాపుకు తీసుకువెళ్లి ఆమెకు నచ్చిన జ్యయలరీ కొని పెట్టాడు. అవి తీసుకుని ఇంటికి వచ్చిన తర్వాత ఆమె నోటిలో గుడ్డలు కుక్కి పొత్తి కడుపు వద్ద మత్తు ఇంజెక్షన్ ఇచ్చాడు. ఆమె స్పృహతప్పి పడిపోయిందని నిర్ధారణ అయ్యాక అక్కడి నుంచి ఆమెను కార్ షెడ్ వద్దకు తీసుకు వెళ్లి గొంతు కోసి హత్య చేశాడు. రక్తం బయటకు ప్రవహించకుండా ఆమె చుట్టూ డోర్ మేట్లు అడ్డం పెట్టాడు.
అనంతరం తన భార్యను ఎవరో హత్య చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసు విచారణ జరిగుతున్నసమయంలోనూ రేవంత్ హర్షితతో ఫోన్ లో టచ్ లోనే ఉన్నాడు. రేవంత్ కాల్ లిస్టు లో హర్షిత పేరు చూసిన పోలీసులు ఆమెను విచారించేందుకు ఒక ఎస్ ఐ స్ధాయి అధికారిని ఫిబ్రవరి21న బెంగుళూరు పంపారు.
పోలీసుల వెరిఫికేషన్ లో అక్రమ సంబంధం బయటపడి…. ఇంక ఇద్దరినీ అరెస్ట్ చేస్తారనే భయంతో శుక్రవారం, ఫిబ్రవరి21వతేదీ రాత్రి సమయంలో కడూరు తాలూకా బండికొప్పుల వద్ద కారు ఆపి రైలు పట్టాలపై పడి ఆత్మహత్య చేసుకున్నాడు. సూసైడ్ చేసుకోటానికి ముందు హర్షితకు ఫోన్ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పాడు. రేవంత్ ఆత్మహత్య చేసుకున్న కొన్ని నిమిషాల వ్యవధిలోనే హర్షత కూడా బెంగుళూరులోని తన ఇంట్లో డెత్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది. ఒక యువతి పెట్టుకున్న వివాహేతర సంబంధం ఇద్దరు చిన్నారులను అనాధలు చేసింది.
.