చావే పరిష్కారమా : ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య

  • Published By: madhu ,Published On : March 16, 2019 / 06:47 AM IST
చావే పరిష్కారమా : ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య

ఆర్థిక ఇబ్బందులు..తగాదాలు..ఇతరత్రా కారణాలతో ప్రాణాలు తీసుకుంటున్నారు. ప్రకాశం జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడడం ఆ గ్రామంలో తీవ్ర విషాదం నింపింది. దీనికంతటికీ కారణం ఆర్థిక ఇబ్బందులే కారణమని స్థానికులు చెబుతున్నారు. 

ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అల్లినగరం గ్రామంలో రాఘవేంద్ర (45), ఈశ్వరి (35) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి వైష్ణవి (13), వరలక్ష్మీ (10) సంతానం. మార్చి 15వ తేదీ అర్ధరాత్రి వీరు విగతజీవులుగా దర్శనమిచ్చారు. కొన ప్రాణంతో ఉన్న వరలక్ష్మీని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె కూడా కన్నుమూసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ పురుగుల మందు డబ్బా పడి ఉంది. కూల్ డ్రింక్‌లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఆర్థిక ఇబ్బందులే కారణమని స్థానికులు వెల్లడిస్తున్నారు.