Farmer Family Suicide Attempt : బ్యాంకు ముందు రైతు కుటుంబం ఆత్మహత్యాయత్నం

కర్నూలు జిల్లా మంత్రాలయం  స్టేట్ బ్యాంక్ ఆఫ్  ఇండియాబ్రాంచ్  దగ్గర ఈరోజు  ఉద్రిక్తత నెలకొంది.

Farmer Family Suicide Attempt : కర్నూలు జిల్లా మంత్రాలయం  స్టేట్ బ్యాంక్ ఆఫ్  ఇండియాబ్రాంచ్  దగ్గర ఈరోజు  ఉద్రిక్తత నెలకొంది. బ్యాంకులో తీసుకున్న అప్పు  చెల్లించినా బ్యాంకు అధికారులు  పొలం కాగితాలు ఇవ్వలేదనే మనస్తాపంతో ఓరైతు తన కుటుంబంతో సహా బ్యాంకు ఎదుట ఆత్మహత్యాయత్నం చేయబోయాడు.

చెట్నాహల్లి గ్రామానికి చెందిన బోయ నాగేంద్ర అనే రైతు తన పొలం కాగితాలు, పాసు పుస్తకాలు తనఖా పెట్టి మంత్రాలయం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మంత్రాలయం బ్రాంచ్ లో రూ. 30 లక్షల రూపాయల రుణం తీసుకున్నాడు. కాలక్రమంలో బ్యాంకుకు మొత్తం అప్పు తిరిగి చెల్లించాడు.  అయినా బ్యాంకు అధికారులు రైతుకు సంబంధించిన పొలం ఒరిజినల్ ఆస్తి కాగితాలు…పాసు పుస్తకాలు తిరిగి ఇవ్వలేదు. వాటికోసం రైతు బ్యాంకు చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు.

విసుగు చెంది ఈ రోజు కుటుంబ సభ్యులతో సహా బ్యాంకు వద్దకు వచ్చి ఆందోళన చేసాడు. అయినా బ్యాంక్ అధికారులు సరిగా స్పందించక పోయేసరికి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయబోయారు. ఇది గమనించిన కొందరు బ్యాంకు సిబ్బంది పురుగుల మందు డబ్బాను లాకున్నారు. కాగా రైతు నాగేంద్రకు చెందిన  పొలం డ్యాక్యుమెంట్లు మిస్ అయ్యాయని బ్యాంకు అధికారులు చెబుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు