కన్నతండ్రే కన్నకూతుర్ని కాటేశాడు. తన కోర్కెలు తీర్చుకునేందుకు కుమార్తెకు నరకం చూపించాడు. చిత్రహింసలకు గురిచేస్తూ సైకోలా తండ్రి ప్రవర్తించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. కీచకుడిలా మారి కూతురితో తన లైంగిక వాంఛ తీర్చుకోవాలనుకున్నాడు.
అంతేకాదు.. తనకు సహకరించాలని వేధించడమే కాకుండా ఆమెకు ప్రతిరోజు పోర్న్ వీడియోలు చూపిస్తూ నరకం చూపించాడు. పలుమార్లు అత్యాచారయత్నం చేశాడు. తండ్రి కామ చేష్టలతో కంగుతిన్న బాధితురాలు వెంటనే చైల్డ్ లైన్ వారిని అశ్రయించింది. కీచకుడిలా ప్రవర్తించిన తండ్రిని పోలీసులు అరెస్టు చేసిన ఛత్తీస్‌గఢ్‌లో జరిగింది.
సూరజ్‌పూర్ జిల్లాలో తండ్రి సవతి కూతురిని లైంగికంగా వేధించాడు. కొన్ని నెలలుగా పోర్న్ వీడియోలు చూపిస్తూ వేధిస్తున్నాడు. బాలికలో కామ కోరికలు రెచ్చగొట్టేలా పోర్న్ వీడియోలు చూడాలని ఒత్తిడి చేసేవాడు. ఇలా ప్రతిరోజు బాలికను బలవంతం చేస్తూ వచ్చాడు. ఇంట్లో సరైన సమయం చూసి అత్యాచారానికి యత్నించాడు.
తండ్రి తీరుతో షాకైన బాలిక భయపడిపోయింది. గట్టిగా కేకలు వేస్తూ బయటకు పరుగులు తీసింది. తన తండ్రి వేధిస్తున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేసింది. స్థానికులు చైల్డ్ లైన్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో తండ్రి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. బాలిక చెప్పిన వివరాలతో నిందితుడిపై సూరజ్‌పూర్ పోలీసులకు చేశారు.