Rajasthan : 14 ఏళ్ల పసిమొగ్గపై కామాంధుల కిరాతకం .. గుండె చెదిరి కూతురు చితిలో దూకిన తండ్రి ..

కామాంధులు పసిమొగ్గ జీవితాన్ని చిదిమేశారు. కిరాతకంగా హత్య చేశారు. మృతదేహాన్ని బొగ్గుల కొలిమిలో కాల్చి, శరీర భాగాల్ని ఓ చెరువులో విసిరేశారు.

Rajasthan : 14 ఏళ్ల పసిమొగ్గపై కామాంధుల కిరాతకం .. గుండె చెదిరి కూతురు చితిలో దూకిన తండ్రి ..

rajasthan

Updated On : August 8, 2023 / 3:50 PM IST

Rajasthan Crime : అత్యంత దారుణానికి గురైన కన్నబిడ్డ కళ్లముందు కట్టెల్లో కాలిపోతుంటే కన్నతండ్రి భరించలేకపోయాడు. గుండెలమీద పెట్టి పెంచుకున్న కూతురు కామాంధుల దురాగతానికి బలై మంటల్లో సభ్యసమాజం విలువలు ఆహుతి అయిపోతుంటే ఆ కన్నతండ్రి గుండె చెదిరిపోయింది. బిడ్డ కాలిపోతున్న మంటల్లోకి దూకి తాను కూడా ప్రాణాలు తీసుకున్న అత్యంత దారుణ ఘటన రాజస్థాన్ లోని భిల్వారాలో చోటుచేసుకుంది.

రాజస్థాన్‌లోని భిల్వారాలో సోమవారం చోటుచేసుకుంది. భిల్వారా జిల్లాలో ఆగస్టు 2న 14 ఏళ్ల చిన్నారిపై కామాంధుల కళ్లు పడ్డాయి. సామూహిక అత్యాచారానికి పాల్పడిన కామాంధులు..ఆ పసిమొగ్గ జీవితాన్ని చిదిమేశారు. ఆ తరువాత కిరాతకంగా హత్య చేశారు. మృతదేహాన్ని బొగ్గుల కొలిమిలో కాల్చి, శరీర భాగాల్ని ఓ చెరువులో విసిరేశారు. తన బిడ్డ ఇంతటి దురాగతనాకి గురి అయ్యిదని తెలిసిన ఆ తండ్రి గుండె పగిలిపోయింది. చిట్టిపాదాలు కందిపోకుండా గుండెలమీద పెంచుకున్న చిట్టితల్లి అత్యంత దారుణంగా..కిరాతకంగా సభ్యసమాజం సిగ్గుపడే ఘాతుకానికి గురి కావటంతో ఆ తండ్రి గుండె పగిలిపోయింది. గుర్తుపట్టలేని విధంగా లభ్యమైన ఆ మృతదేహానికి కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వర్తిస్తుండగా.. అప్పటి వరకూ మౌనంగా రోదించిన ఆ తండ్రి హృదయం నిస్సహాయంగా కుమిలిపోయింది. బిడ్డను వీడి జీవించలేని ఆ తండ్రి కూతురు చితిమంటల్లో దూకాడు.కానీ తోటి వ్యక్తులు వెంటనే స్పందించటంతో ప్రాణాలతో బయటపడ్డాడు.

Gang Rape : ఇద్దరు బాలికలపై సామూహిక అత్యాచారం.. ఆపై వీడియో చిత్రీకరణ, బయటికి చెబితే

అల్లారుముద్దుగా పెంచుకున్న తన బంగారు తల్లికి జరిగిన అన్యాయాన్ని భరించలేకపోయాడు. ఆమెతో పాటు తాను కూడా కాలిపోయేందుకు చితిలోకి దూకాడు. కానీ అక్కడున్నవారు వెంటనే అప్రమత్తమై మంటల్లోంచి బయటికి లాగి చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని ప్రాణాలకు ప్రమాదం లేదని భిల్వారా జిల్లా ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ అరుణ్ గౌర్ వెల్లడించారు.

కాగా బాధితురాలు..మృతురాలు సామూహిక అత్యాచార ఘటనలో ఆరుగురు మగవారితో పాటు మరో నలుగురు మహిళల్ని నిందితులుగా పోలీసులు గుర్తించారు. ఈకేసులో నిర్లక్ష్యంగా వ్యహరించిన కోట్రా పోలీసు స్టేషన్‌ అసిస్టెంట్‌ సబ్‌-ఇన్‌స్పెక్టర్‌పై సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు. ఇది చాలా దారుణమైన ఘటన అని నిందితులందరికీ ఉరిశిక్ష పడేలా చూస్తామని భిల్వారా ఎస్పీ ఆదర్శ్‌ సిద్ధూ హామీ ఇచ్చారు.

కాగా ఆగస్టు 2(2023)న 14 ఏళ్ల బాలిక పశువులను మేపడానికి వెళ్లి కనిపించకుండాపోయింది. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. అన్నిచోట్లా వెతికారు. కానీ ఎక్కడా కనిపించలేదు. ఆ తరువాత రెండు రోజులకు ఈ గ్రామం సమీపంలోని చెరువో కలిపోయిన శరీర భాగాలు కనిపించటంతో తీవ్ర కలకలం రేగింది. దీనిపై స్థానికుల సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారింగా రెండు రోజుల క్రితం కనిపించకుండాపోయిన బాలికేనని..సామూహిక అత్యాచారానికి గురైందని గుర్తించారు.