హైదరాబాద్: అకతాయిల చేసిన పనులకు ఓ మహిళా సీఐ మగవారి నుంచి వేధింపులు ఎదుర్కొన్నారు. హైదరాబాద్, నార్త్ జోన్ పరిధిలో పని చేసే ఒక మహిళా సీఐ ఫోన్ నెంబరు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు సోషల్ మీడియాలోని డేటింగ్ యాప్ లో పోస్ట్ చేశారు. దీంతో ఆమెకు మార్చి 14 అర్ధరాత్రి నుంచి పరిచయం లేని వ్యక్తుల నుంచి ఫోన్లు, అసభ్యకరమైన మెసేజ్ లు రావటం మొదలయ్యాయి. దీంతో అప్రమత్తమైన సీఐ, ఫోన్లు, మెసేజ్ లు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఆరా తీసారు.
తన ఫోన్ నెంబరును గుర్తు తెలియని వ్యక్తులు చాట్ కరో.ఇన్ పేరుతో ఉన్న ఆన్ లైన్ చాటింగ్ యాప్ లో పోస్టు చేసినట్లు సీఐ గుర్తించారు. దీంతో ఆమె సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.