ప్రయాగ్ రాజ్ : ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న కుంభమేళాలో మంగళవారం అగ్నిప్రమాదం సంభవించింది. ఈప్రమాదంలో 2 గుడారాలు పూర్తిగా కాలిపోయాయి. ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరుగలేదు. భారీగా నగదు కాలి పోయింది. ప్రమాదం గమనించిన అగ్నిమాపకసిబ్బంది అప్రమత్తమై మంటలను అదుపు చేశారు.
ఈ ప్రమాదంలో గుడారాల్లో ఉంచిన నగదు పూర్తిగా కాలిపోయింది. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.జనవరి 15 నుంచి ప్రారంభమైన కుంభమేళా మార్చి 4 వరకు జరుగుతుంది. ప్రారంభానికి ముందే జనవరి 14న దిగంబర్ అఖాడా శిబిరంలో గ్యాస్ సిలిండర్ పేలి మంటలు చెలరేగాయి.
#SpotVisuals: Fire had broken out in two tents at #KumbhMela2019, Prayagraj earlier today. It was later brought under control. No injuries/casualties have been reported. pic.twitter.com/TEGxY4p8G8
— ANI UP (@ANINewsUP) February 5, 2019