హత్రాస్ అత్యాచార ఘటనలో కొత్త ట్విస్ట్..!

  • Publish Date - October 1, 2020 / 07:17 PM IST

Hathras victim : దేశవ్యాప్తంగా సంచలనం రేకిత్తించిన హత్రాస్‌ అత్యాచార ఘటనలో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. యువతి అత్యచారానికి గురికాలేదని ఫోరెన్సిక్ రిపోర్టు వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే పోస్టు మార్టం నివేదిక విడుదలయ్యింది. మెడకు తగిలిన గాయం కారణంగా బాధితురాలు మరణించిందని పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది.



ఫోరెన్సిక్‌ రిపోర్టులో బాధితురాలిపై అత్యాచారం జరగలేదనడం సంచలనంగా మారింది. కుల ఆధారిత ఉద్రిక్తతను రేకిత్తించడానికి కేసును తప్పుదారి పట్టిస్తున్నారని ఉత్తరప్రదేశ్ ఏడీజీ లా అండ్ ఆర్డర్ ప్రశాంత్ కుమార్ చెప్పారు. కుల విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకుంటామని ఏడీజీ హెచ్చరించారు.



గత నెల సెప్టెంబర్ 14న పొలంలో పని చేస్తున్న యువతిపై నలుగురు వ్యక్తులు విచక్షణరహితంగా దాడికి పాల్పడ్డారు. దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితురాలు ఢిల్లీ సఫ్దర్‌జంగ్‌ ఆస్పత్రిలో రెండు వారాల పాటు మృత్యువుతో పొరాడుతూ చివరికి ప్రాణాలు విడిచింది.



ఇప్పుడు వచ్చిన ఫోరెన్సిక్‌ నివేదికలో మృతురాలి శరీరంలో స్పెర్మ్ (వీర్యం) నమూనాలు లేవని తేలింది. బాధితురాలిపై అత్యాచారం జరగలేదని FSL report స్పష్టం చేసింది.

ట్రెండింగ్ వార్తలు