ప్రకాశం జిల్లా చీరాలలో నాగార్జున రెడ్డి అనే జర్నలిస్టుపై వైసీపీ నేతలు దాడి చేయటాన్నిటీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. సీఎం గా జగన్ ఫెయిల్ అయ్యారని ఆయన ట్విట్టర్ లో ఫైర్ అయ్యారు.
“వైసీపీ ప్రభుత్వంలో పాలకుల అక్రమాలు బయటపెడితే ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది… చీరాల విలేఖరి నాగార్జున రెడ్డిపై వైసీపీ నేతలు చేసిన దాడి అమానుషం అక్రమాలు బయటపెడితే కక్షగడతారా? పదేపదే దాడి చేస్తారా? ఎస్పీకి వినతి పత్రం ఇచ్చి వస్తుంటే దాడి చేసారంటే పోలీసులు ఏం చేస్తున్నారు?”
“ఇంతకు ముందు మరో వైసీపీ నేత, పాత్రికేయుని ఇంటికెళ్ళి ప్రాణాలు తీస్తామని బెదిరించి వచ్చారు. ముఖ్యమంత్రిగారేమో తన దొంగ పత్రిక సాక్షి తప్ప మరో పత్రిక ఉండకూడదంటారు, ఏమిటీ నిరంకుశత్వం? ఇది నాగరిక రాజ్యమా? కరడుగట్టిన కాలకేయ రాజ్యమా?” అని ట్వీట్టర్ లో పోస్టు చేశారు.
ఇంతకు ముందు మరో వైసీపీ నేత, పాత్రికేయుని ఇంటికెళ్ళి ప్రాణాలు తీస్తామని బెదిరించి వచ్చారు. ముఖ్యమంత్రిగారేమో తన దొంగ పత్రిక సాక్షి తప్ప మరో పత్రిక ఉండకూడదంటారు. ఏమిటీ నిరంకుశత్వం? ఇది నాగరిక రాజ్యమా? కరడుగట్టిన కాలకేయ రాజ్యమా?#YSJaganFailedCM
— N Chandrababu Naidu (@ncbn) September 24, 2019