Nandyala : హోం గార్డుపై నలుగురి దాడి-మృతి
నంద్యాల జిల్లాలో దారుణ ఘటన జరిగింది. నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు ఒక హోం గార్డుపై దాడి చేసారు ఈ ఘటనలో హోం గార్డు మరణించాడు. రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న కేంద్ర గిడ్డంగుల సంస్ధ

Home Guard Died
Nandyala : నంద్యాల జిల్లాలో దారుణ ఘటన జరిగింది. నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు ఒక హోం గార్డుపై దాడి చేసారు ఈ ఘటనలో హోం గార్డు మరణించాడు. రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న కేంద్ర గిడ్డంగుల సంస్ధ వద్ద శేఖర్ అనే వ్యక్తి హోం గార్డుగా పని చేస్తున్నాడు.
సీడబ్ల్యూసీ కార్యాలయంలోకి నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చారు. వారు తిరిగి వెళుతుండగా హోంగార్డు వారిని అడ్డగించాడు. కార్యాలయంలోకి ఎందుకొచ్చారు అని అడగ్గా… వారు హోం గార్డుపై దాడి చేసి నెట్టారు.
దీంతో అతను ఇనుప గేటుపై పడ్డాడు. ఆ సమయంలో అతని తలకు తీవ్రగాయం అయ్యింది. శేఖర్ ను ఆస్పత్రికి తరలించే లోపే మృతిచెందాడు. ఈ ఘటనపై కేసునమోదు చేసుకున్న పోలీసులు నలుగురు నిందితుల కోసం గాలింపు చేపట్టారు.
Also Read : Corona 4th Wave: దేశంలో కరోనా నాలుగో దశ రానుందా?: నిపుణులు ఏమంటున్నారంటే