ఫేస్ బుక్ ఫ్రెండ్ షిప్ బ్లాక్ మెయిలింగ్ తో బ్రేకప్ అయింది. ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ తో ఫ్రెండ్ షిప్ డ్రామా స్టార్ట్ చేశాడు. ఎన్ ఆర్ ఐ అన్నాడు. ఒరిజినల్ హోం టౌన్ డెహ్రాడూన్.. ఉండేది మాత్రం ఆస్ట్రేలియాలో అన్నాడు.
ఘజియాబాద్: ఫేస్ బుక్ ఫ్రెండ్ షిప్ బ్లాక్ మెయిలింగ్ తో బ్రేకప్ అయింది. ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ తో ఫ్రెండ్ షిప్ డ్రామా స్టార్ట్ చేశాడు. ఎన్ ఆర్ ఐ అన్నాడు. ఒరిజినల్ హోం టౌన్ డెహ్రాడూన్.. ఉండేది మాత్రం ఆస్ట్రేలియాలో అన్నాడు. వినయం ఒలకబోశాడు. మంచితనం అనే ముసుగుతో మాటలు కలిపాడు. అంకిత్ శర్మగా పరిచయం చేసుకున్నాడు. చివరికి తనకు కేన్సర్ అంటూ కలరింగ్ ఇచ్చాడు. అమ్మాయి నుంచి సింపతీ కొట్టేశాడు. ఫేస్ బుక్ వేదికగా కొంతకాలం డ్రామా నడిపాడు. కట్ చేస్తే.. ఓ రోజు పెళ్లి చేసుకుంటానంటూ ప్రపోజ్ చేశాడు. అప్పటికే పెళ్లైన యువతి అతడి మాటలు నమ్మి ట్రాప్ లో పడింది. తన ఫొటోలు, వీడియోలు కొన్ని పంపింది. ఇంకేముంది.. డబ్బులు గుంచేందుకు బ్లాక్ మెయిలింగ్ స్టార్ట్ చేశాడు. సోషల్ మీడియాలో యువతి ఫొటోలు పెడతానని బెదిరించాడు. అప్పటినుంచి అతడితో మాట్లాడటం మానేసింది.
ఆఖరికి యువతి భర్త, కుటుంబ సభ్యులకు కూడా ఫొటోలు, వీడియోలు పంపాడు. అది చూసిన యువతి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారమంతా వెలుగులోకి వచ్చింది. ఫేస్ బుక్ ఫ్రెండ్ షిప్లో ఏనాడు కూడా తాను ఎలా ఉంటాడో ఒక్క ఫొటో ఇవ్వలేదు. అడిగినా మాట దాటేశాడని యువతి పోలీసులకు వివరించింది. అంకిత్ శర్మగా పరిచయమయ్యాడని మాత్రమే తెలిపింది. తన ఫొటోలు అడిగాడు గానీ, అతడి ఫొటోలు అడిగితే ఇవ్వలేదని, అప్పుడే తనకు అనుమానం వచ్చిందని యువతి వాపోయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు అంకిత్ ను పట్టుకునేందుకు సైబర్ సెల్ కు సమాచారం అందించి దర్యాప్తు చేపట్టారు.