అడ్డదారులు : అంబులెన్స్ లో గంజాయి స్మగ్లింగ్

  • Publish Date - February 23, 2019 / 12:40 PM IST

విశాఖపట్నం : గంజాయి అక్రమ రవాణాకి పోలీసులు నిరంతరం చెకింగ్ లు చేసి చెక్ పెడుతుడటంతో అడ్డదారిలో  గంజాయి తరలింపుకు సిద్దమ్యయారు స్మగ్లర్లు.  విశాఖపట్నంలో అంబులెన్స్‌లో అక్రమంగా తరలిస్తున్న 18 క్వింటాళ్ల 13 కేజీల గంజాయిని డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవిన్యూ ఇంటిలిజెన్స్‌ అధికారులు శనివారం స్వాధీనం చేసుకున్నారు.

సబ్బవరం నుంచి పెందుర్తి వైపు వెళుతున్న అంబులెన్స్‌లో ఈ గంజాయిని తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీని విలువ 2 కోట్ల 71 లక్షల 95 వేల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. అంబులెన్స్‌ను సీజ్‌ చేసిన అధికారులు.. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.