14ఏళ్ల బాలికను చంపి కంటిగుడ్లు పీకేశారు
ప్రాణం పోయాక ఎవరైనా కాస్త తగ్గుతారు. కానీ, చంపేసి కంటి గుడ్లను సైతం పీకేంత శాడిజం చాలా అరుదుగా వింటుంటాం. ఈ ఘటన ఓ చిన్నారిపై జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని జలౌన్ గ్రామానికి చెందిన 14ఏళ్ల బాలిక మృతదేహాన్ని పోలీసులకు దొరికింది.

ప్రాణం పోయాక ఎవరైనా కాస్త తగ్గుతారు. కానీ, చంపేసి కంటి గుడ్లను సైతం పీకేంత శాడిజం చాలా అరుదుగా వింటుంటాం. ఈ ఘటన ఓ చిన్నారిపై జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని జలౌన్ గ్రామానికి చెందిన 14ఏళ్ల బాలిక మృతదేహాన్ని పోలీసులకు దొరికింది.
నేరమనేది ఉద్దేశ్యపూర్వకంగా చేసినా అది ఆవేశంతో కూడినదే. ప్రాణం పోయాక ఎవరైనా కాస్త తగ్గుతారు. కానీ, చంపేసి కంటి గుడ్లను సైతం పీకేంత శాడిజం చాలా అరుదుగా వింటుంటాం. ఈ ఘటన ఓ చిన్నారిపై జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని జలౌన్ గ్రామానికి చెందిన 14ఏళ్ల బాలిక మృతదేహాన్ని పోలీసులకు దొరికింది.
పొరుగింటి వ్యక్తిని అనుమానిస్తూ అదుపులోకి తీసుకున్నారు. ఆ బాలిక మృతదేహం వంటిపై బట్టలు చినిగిపోయి ఉండటమే కాక, కనుగుడ్లను పీకేశారు. శనివారం నుంచి కనిపించడం లేదని ఆమె తల్లిదండ్రులు పోలీస్ కంప్లైంట్ చేశారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించే సమయానికి మృతురాలిగా కనిపించింది.
శవం ప్రాథమిక నిర్థారణకు వచ్చిన పోలీసులు రేప్, హత్య జరిగినట్లుగా అనుమానిస్తున్నారు. డీఐజీ సుభాష్ సింగ్ భాగెల ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు రేప్ కేస్ కింద కేసు నమోదు చేసుకున్నారు.
‘పొరుగింటి వ్యక్తిపైనే అనుమానంగా ఉంది. అతనే నేరం చేసి ఉండొచ్చని భావిస్తున్నాం. గతంలో ఓ సారి మైనర్ బాలికను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయి. పోస్టు మార్టం రిపోర్టు వచ్చిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తాం. అరెస్టు చేసిన వ్యక్తిని విచారిస్తున్నాం’ అని డీఐజీ తెలిపారు.