×
Ad

Goa Liquor Seized :10 లక్షల రూపాయల విలువైన గోవా మద్యం స్వాధీనం

తూర్పుగోదావరి జిల్లాలో రూ.10 లక్షల విలువైన గోవా మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారంతో... రావులపాలెం పోలీసులు, జిల్లా స్పెషల్ బ్రాంచ్ బృందం

  • Published On : February 25, 2022 / 01:21 PM IST

Goa Liquor Seized

Goa Liquor Seized :  తూర్పుగోదావరి జిల్లాలో రూ.10 లక్షల విలువైన గోవా మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారంతో… రావులపాలెం పోలీసులు, జిల్లా స్పెషల్ బ్రాంచ్ బృందం కలిసి రావులపాలెం మండలం రావులపాడు గ్రామంలో నేషనల్ హైవేకి దగ్గరలో ఉన్న నాయుడు లేఔట్ లో ఉన్న గోడౌన్ నందు దాడులు నిర్వహించారు.

గోడౌన్  లో నిల్వ  ఉంచిన  గోవాకు చెందిన 9,200 క్వార్టర్ విస్కీ బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు. గోవా నుంచి మద్యాన్ని తెప్పించి నిల్వ చేసిన ప్రధాన ముద్దాయి కూసుమంచి వెంకట రత్న త్రినాథ్ తో పాటు మరో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Also Read : Playing Cards : హైటెక్ పేకాట రాకెట్ గుట్టు రట్టు-14 మంది అరెస్ట్
రావులపాలెం పోలీసు స్టేషన్ లో కేసు నమోదు చేసారు. కేసులో తదుపరి విచారణ కొనసాగుతోందని, మరి కొంతమంది ముద్దాయిలను విచారణలో గుర్తించి అరెస్ట్ చేయాల్సి ఉంటుందని జిల్లా  ఎస్పీ   ఎం.రవీంద్రనాథ్ బాబు తెలిపారు.