West Bengal : మూడు ఏనుగుల్ని చంపిన రైలు సీజ్

మూడు ఏనుగుల్ని చంపిన రైలు సీజ్ చేశారు అటవీశాఖ అధికారులు.

West Bengal : మూడు ఏనుగుల్ని చంపిన రైలు సీజ్

Goods train seized in West Bengal

Updated On : November 28, 2023 / 12:22 PM IST

Goods train siege in West Bengal : భారతదేశంలో అతి పెద్ద రవాణా వ్యవస్థ రైల్వే. కొండలు, అడవులు, పల్లెలు, పట్టణాల వెంట ప్రయాణించే రైళ్లు ఎంతోమందిని గమ్యస్థానాలకు చేరుస్తుంటాయి. తక్కువ ఖర్చు..ఎక్కువ సౌకర్యంతో ఉండటంతో పలువురు రైలు ప్రయాణానికే మొగ్గుచూపుతుంటారు. అటువంటి రైళ్లు ఎన్నో మనోహరమైన ప్రాంతాలగుండా ప్రయాణిస్తుంటాయి. పచ్చని అడవుల గుండా ప్రయాణించే క్రమంలో కొన్ని ప్రమాదాలు కూడా జరుగుతుంటాయి. అడవుల్లో ప్రయాణించే క్రమంలో పలు వన్యప్రాణులు రైళ్లకు అడ్డంగా వస్తుంటాయి. కానీ రైలు వెళ్లే వేగాన్ని బట్టి వన్యప్రాణులు ప్రాణాలు బలైపోతుంటాయి.

అడవుల గుండా రైళ్లు ప్రయాణించే క్రమంలో రైలుపట్టాలు దాటే క్రమంలో ఏనుగులు వంటివి మరణిస్తుంటాయి. అదే జరిగింది పశ్చిమబెంగాల్ లోని అలీపుర్ దువార్ జిల్లాలో. అలీపుర్ దువార్నుంచి సిలిగురిం వెళుతున్న గూడ్స్ రైలు రాజభట్ ఖావా వద్ద అడవుల గుండా ప్రయాణిస్తుండగా..రైలుకు అడ్డంగా వచ్చిన మూడు ఏనుగులో మృతి చెందాయి. గూడ్స్ రైలు మూడు ఏనుగులను ఢీకొనటంలో అవి చనిపోయాయి. అలీపుర్‌ద్వార్‌ జిల్లాలో రాజభట్ఖావా అడవుల్లో సోమవారం (నవంబర్ 27,2023)ఉదయం 7.20 గంటల సమయంలో జరిగిన ఈ ఘటనలో గూడ్స్ ను అటవీశాఖ అధికారులు సీజ్ చేశారు.

ప్రియుడిపై మోజు .. కన్నకూతుళ్లపై లైంగిక వేధింపులకు సహకరించిన తల్లికి 40 ఏళ్ల జైలు శిక్ష

రైలును సీజ్ చేసిన విషయంపై చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ దేబల్ రామ్ మాట్లాడుతు..రైలును సీజ్ చేయటమంటే అది సాంకేతికమైనదని..రైలును భౌతికంగా స్వాధీనపరచుకోవటం కాదని తెలిపారు. ప్రమాదం జరిగిన స్థలంలోనే రైలు ఉందన్నారు. కానీ పేపర్స్ విషయంలో సీజ్ ప్రక్రియను జరిపామని తెలిపారు. పట్టాలపైకి ఏమైనా అడ్డంగా వస్తే గుర్తించి అప్రమత్తం చేసే ఐడీఎస్‌ ఈ మార్గంలో లేదని రైల్వే అధికారులు తెలిపారు. ఐడీఎస్‌ ఉన్నచోట ఏనుగులను రైళ్లు ఢీకొన్న ఘటనలు లేవని చెప్పారు. కాగా..ఈ ప్రక్రియలో భాగంగా..రైలు డ్రైవర్‌, అసిస్టెంట్‌ డ్రైవర్‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు.