Gunturu : బీటెక్ విద్యార్ధిని రమ్య హత్యకేసులో నిందితుడికి ఉరిశిక్ష

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బీటెక్ విద్యార్థిని రమ్య హత్యకేసు విచారణ పూర్తయింది. గుంటూరు ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి రాంగోపాల్  నిందితుడు శశికృష్ణ కు  ఉరిశిక్ష విధించారు.

Gunturu : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బీటెక్ విద్యార్థిని రమ్య హత్యకేసు విచారణ పూర్తయింది. గుంటూరు ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి రాంగోపాల్  నిందితుడు శశికృష్ణ కు  ఉరిశిక్ష విధించారు. తనను ప్రేమించటం  లేదనే కోపంతో గతేడాది ఆగస్ట్ 15న శశికృష్ణ రమ్యను నడిరోడ్డుపై దారుణంగా హత్య చేశాడు. పరమయ్యకుంట వద్ద గతేడాది ఆగస్ట్ 15వ తేదిన హత్య జరగ్గా తొమ్మిది నెలలలో విచారణ పూర్తయింది. హత్యకేసు నిందితుడు శశికృష్ణ ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నాడు.

గుంటూరు నగరంలో జరిగిన నల్లుప  రమ్య హత్య కేసులో ప్రత్యేక న్యాయస్థానం విచారణ పూర్తయింది. పరమయ్యకుంటకు చెందిన రమ్య బిటెక్ చదువుతోంది. సామాజిక మాధ్యమాల్లో పరిచయమైన కుంచాల శశికృష్ణ ప్రేమ పేరుతో రమ్యని వేధించాడు. తన ప్రేమ కాదన్నదన్న కోపంతో ఆగస్ట్ 15వ తేదిన చుట్టుపక్కల వారు చూస్తుండగానే నడిరోడ్డుపై రమ్యను కత్తితో పొడిచి హత్య చేశారు.0

హత్య  దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. నిందితుడు శశికృష్ణను నరసరావుపేట సమీపంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  హత్య జరిగిన 24 గంటల్లోనే నిందితుడిని అరెస్టు చేయటంతో పాటు 15రోజుల్లో ఛార్జిషీట్ దాఖలు చేశారు. రమ్య శరీరంపై 8 కత్తి పోట్లను వైద్యులు గుర్తించారు. సాక్షాధారాలు లభించటంతో పాటు ప్రత్యక్షంగా హత్య చూసిన వారు కూడా విచారణకు సహకరించారు.

ఈ కేసులో డీఎస్పీ రవికుమార్‌ని విచారణ అధికారిగా నియమించారు. ఆయన మొత్తం 36మంది సాక్షులను విచారించి ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ప్రత్యేక కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎన్.శారదామణి కూడా వారిలో 28మందిని విచారించారు. ఆ తర్వాత ప్రత్యేక కోర్టు న్యూయమూర్తి రాంగోపాల్ వద్ద సాక్షులు వాంగ్మూలం ఇచ్చారు.

డిసెంబర్ 7 నుంచి మార్చి 2వ తేది వరకూ ఈ ప్రక్రియ జరిగింది. ఆ తర్వాత ఇరువర్గాల వాదనలు వినటం ప్రారంభించి… మంగళవారంతో పూర్తి చేశారు. హత్య కేసులో కీలకమైన సీసీ టీవి వీడియోను న్యాయమూర్తి పరిశీలించారు. నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ ఈ రోజు మధ్యాహ్నం తీర్పు నిచ్చారు. నిందితుడు శశికృష్ణ గుంటూర్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు.

Also Read : Shanghai Lockdown : షాంఘైలో మళ్లీ లాక్‌డౌన్… ఊరు ఖాళీ చేస్తున్న ప్రజలు

 

 

ట్రెండింగ్ వార్తలు