హాజీపూర్ వరుస హత్య కేసులో విచారణ ముగిసింది. ఫోరెన్సిక్ రిపోర్టును ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు పోలీసులు అందచేశారు. సెల్ టవర్ లోకేషన్, కీలక సాక్ష్యాలను అందచేశారు. మొత్తం రెండు నెలల పాటు ఫాస్ట్ ట్రాక్ కోర్టు విచారణ చేపట్టింది. 300 మంది సాక్షులను వాంగ్మూలాలాను రికార్ఢ్ చేశారు. విచారణ ముగియడంతో తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. డిసెంబర్ నెలాఖరులో తీర్పు వెలువడే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ముగ్గురు బాలికలపై శ్రీనివాస రెడ్డి హత్యాచారం చేసిన సంఘటన సంచలనం సృష్టించింది. షాద్ నగర్‌లో దిశా ఘటనలో నిందితులను ఎన్ కౌంటర్ చేయడంతో హత్యాచారణ ఘటనలో ఇలానే వ్యవహరించాలని డిమాండ్స్ వినిపించాయి. శ్రీనివాస్ రెడ్డిని బహరింగంగా ఉరి తీయాలని డిమాండ్స్ చేస్తూ..బాధిత కుటుంబం, హాజీపూర్ గ్రామస్తులు డిమాండ్ చేశారు.
ఎప్పుడేం జరిగింది : –
* 2019, ఏప్రిల్ 25 హాజీపూర్ గ్రామంలో విద్యార్థిని శ్రావణి అదృశ్యం.
* 2019. ఏప్రిల్ 25 పోలీసులకు తల్లిదండ్రులు కంప్లయింట్.
* 2019, ఏప్రిల్ 25 శ్రావణి కోసం పోలీసుల గాలింపు.
* సీసీ కెమెరాలు లేకపోవడంతో దొరకని ఆచూకీ.
* 2019, ఏప్రిల్ 26 శ్రావణి పాఠశాలకు వెళ్లి విచారించిన పోలీసులు.
* 2019, ఏప్రిల్ 26 శ్రావణి బొమ్మలరామారం వెళ్లినట్లు గుర్తింపు.
* 2019, ఏప్రిల్ 26 సీసీటీవీ ఫుటేజ్‌తో దర్యాప్తు ప్రారంభం.
* కీసర – బొమ్మలరామారం మార్గంలో గాలింపు.
* 2019, ఏప్రిల్ 26 పాడుబడిన బావి పక్కన శ్రావణి స్కూల్ బ్యాగ్ గుర్తింపు.
* 2019, ఏప్రిల్ 27 బావిలో దొరికిన మృతదేహం.
* శ్రావణి మృతదేహాన్ని గుర్తించిన కుటుంబసభ్యులు.
* 2019, ఏప్రిల్ 27 శ్రీనివాసరెడ్డికి చెందిన బావిగా గుర్తించిన పోలీసులు.
* పోలీసుల అదుపులో శ్రీనివాసరెడ్డి.
* 2019, ఏప్రిల్ 27 శ్రావణిపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు ఒప్పుకున్న శ్రీనివాస్ రెడ్డి.
* 2019, ఏప్రిల్ 29 పోలీసుల విచారణలో బయటపడిన నిజాలు.
* 2019, ఏప్రిల్ 29 2015లో మైసిరెడ్డి పల్లికి చెందిన కల్పనను చంపేసినట్లు చెప్పిన శ్రీనివాస్ రెడ్డి. మనీషా అనే బాలికను కూడా హత్యాచారం చేసినట్లు ఒప్పుకున్నాడు.
ప్రస్తుతం తీర్పు ఏ విధంగా వస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.