ఉరినా?: హాజీపూర్ హత్యల కేసులో తీర్పు నేడే

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హాజీపూర్ వరుస హత్యల కేసుల్లో ఇవాళ(ఫిబ్రవరి 06,2020) నల్లగొండ పోక్సో ప్రత్యేక న్యాయస్థానం తీర్పు చెప్పనుంది. ఇప్పటికే నిర్భయ,

  • Publish Date - February 6, 2020 / 02:49 AM IST

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హాజీపూర్ వరుస హత్యల కేసుల్లో ఇవాళ(ఫిబ్రవరి 06,2020) నల్లగొండ పోక్సో ప్రత్యేక న్యాయస్థానం తీర్పు చెప్పనుంది. ఇప్పటికే నిర్భయ,

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హాజీపూర్ వరుస హత్యల కేసుల్లో ఇవాళ(ఫిబ్రవరి 06,2020) నల్లగొండ పోక్సో ప్రత్యేక న్యాయస్థానం తీర్పు చెప్పనుంది. ఇప్పటికే నిర్భయ, సమత కేసు దోషులకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పులు వచ్చాయి. ఈ నేపథ్యంలో ముగ్గురు మైనర్ బాలికలను అత్యంత అమానుషంగా చెరబట్టి.. హత్య చేసిన శ్రీనివాసరెడ్డికి ఎటువంటి శిక్ష విధిస్తారో అన్న ఆసక్తి నెలకొంది.

ముగ్గురు బాలికలపై అత్యాచారం, హత్య:
యదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌ లో సంచలనం సృష్టించిన ముగ్గురు మైనర్ బాలికలపై దారుణ అత్యాచారం, హత్య ఘటనలో తీర్పు రానుంది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈ కేసులో.. వాస్తవానికి 2020 జనవరి 17న విచారణ ముగియగా.. అదే నెల 27న తీర్పు చెప్తామని న్యాయస్థానం ప్రకటించింది. అయితే తీర్పు కాపీ సిద్ధం కాకపోవడంతో గురువారానికి(ఫిబ్రవరి 6,2020) తీర్పును వాయిదా వేశారు న్యాయమూర్తి. హాజీపూర్‌ కు చెందిన మర్రి శ్రీనివాసరెడ్డి.. ముగ్గురు బాలికలను పాడుబడిన బావిలో పడేసి.. తీవ్రగాయాలపాలై అపస్మారక స్థితిలోకి వెళ్లిన తర్వాత వారి మీద అత్యాచారం జరిపి.. హత్య చేసి పాతిపెట్టినట్లు తేలింది. ఈ ఘటన ఆ ప్రాంత ప్రజలనే కాకుండా.. తెలుగు రాష్ట్రాలను ఉలిక్కిపడేలా చేసింది. 

90 రోజుల్లోనే దర్యాఫ్తు పూర్తి:
ఈ మూడు ఘటనలపై వేర్వేరుగా కేసులు నమోదు చేసిన పోలీసులు.. 90 రోజుల్లోనే దర్యాప్తు పూర్తి చేసి.. జూలై 31న నల్లగొండలోని పోక్సో ప్రత్యేక న్యాయస్థానంలో చార్జ్ షీట్ దాఖలు చేశారు. 2019 అక్టోబర్ 14 నుంచి న్యాయస్థానం విచారణ ప్రారంభించింది. ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరపున సీనియర్ న్యాయవాది చంద్రశేఖర్ వాదనలు వినిపించగా.. డిఫెన్స్ కౌన్సిల్‌ గా సీనియర్ న్యాయవాది రవీంద్రనాథ్ ఠాగూర్ నిందితుడి తరుపున వాదనలు వినిపించారు. సుమారు రెండున్నర నెలల పాటు మూడు కేసుల్లో సాక్షుల విచారణ జరిగింది.

ఆ తర్వాత డిసెంబర్ 19 నుంచి 26 వరకు ప్రాసిక్యూషన్ తన వాదనను వినిపించగా.. డిసెంబర్ 26 నుంచి సిఆర్పీసీ 313 సెక్షన్ కింద సాక్షుల వాంగ్మూలాలపై నిందితుడు శ్రీనివాసరెడ్డి వాదనను న్యాయస్థానం విన్నది. జనవరి 6వ తేదీ నుంచి 17 వరకు ప్రాసిక్యూషన్, డిఫెన్స్ మధ్య వాదోపవాదాలు కొనసాగాయి. జనవరి 17న విచారణ ప్రక్రియ ముగిసింది.

ఉరి తీయాలని డిమాండ్:
నిర్భయ, సమత హత్యాచార దోషులకు ఉరిశిక్ష విధిస్తూ న్యాయస్థానాలు తీర్పులు ఇవ్వడంతో హాజీపూర్ నిందితుడికి కూడా ఉరిశిక్ష విధించాలన్న డిమాండ్ అన్నివర్గాల నుంచి వినిపిస్తుంది. మర్రి శ్రీనివాస రెడ్డి అన్ని విధాలుగా ఉరిశిక్షకు అర్హుడని.. జాలి, దయ చూపాల్సిన అవసరం లేదని ప్రాసిక్యూషన్ పదేపదే విజ్ఞప్తి చేసింది. ఈ కేసులను అరుదైన కేసుల్లో అరుదైనవిగా పరిగణించాలని.. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు అందుకు అనుగుణంగా ఉన్నాయని ప్రాసిక్యూటర్ వాదించారు.

ప్రాసిక్యూషన్ వాదనలోని పలు అంశాలను డిఫెన్స్ తిప్పికొట్టినా.. ప్రాసిక్యూషన్ వాటిని ఖండించింది. కేవలం విచారణను జాప్యం చేసేందుకే నిందితుడు తప్పుడు వాదన వినిపిస్తున్నారని ప్రాసిక్యూషన్ వాదించింది. మరోవైపు బాధిత కుటుంబ సభ్యులతో పాటు.. హాజీపూర్ వాసులు, ప్రజాసంఘాలు, మహిళా సంఘాలు.. నిందితుడు మర్రి శ్రీనివాసరెడ్డికి ఉరిశిక్ష విధించాలని ముక్తకంఠంతో నినదిస్తున్నారు. 

* తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హాజీపూర్ వరుస హత్యలు
* ఇవాళ తీర్పు చెప్పనున్న నల్లగొండ పోక్సో ప్రత్యేక న్యాయస్థానం 
* నిర్భయ, సమత కేసు దోషులకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పులు 
* శ్రీనివాసరెడ్డికి ఎటువంటి శిక్ష విధిస్తారోనని ఉత్కంఠ

* హాజీపూర్ నిందితుడికి ఉరిశిక్ష వేయాలని డిమాండ్లు
* మర్రి శ్రీనివాస్‌రెడ్డి ఉరిశిక్షకు అర్హుడు- ప్రాసిక్యూషన్ 
* ముగ్గురు మైనర్ బాలికలపై హత్యాచారం
* గత నెల 17న ముగిసిన విచారణ 
* 27న తీర్పు చెబుతామన్న న్యాయస్థానం 

* తీర్పు కాపీ సిద్ధం కాకపోవడంతో తీర్పు వాయిదా 
* 90 రోజుల్లోనే దర్యాప్తు పూర్తి 
* జూలై 31న పోక్సో ప్రత్యేక న్యాయస్థానంలో చార్జ్ షీట్ 
* అక్టోబర్ 14 నుంచి విచారణ ప్రారంభం

* ప్రాసిక్యూషన్ తరపున వాదించిన చంద్రశేఖర్ 
* డిఫెన్స్ కౌన్సిల్‌గా రవీంద్రనాథ్ ఠాగూర్ 
* రెండున్నర నెలల పాటు సాక్షుల విచారణ 
* డిసెంబర్ 19 నుంచి 26 వరకు ప్రాసిక్యూషన్ వాదన
* డిసెంబర్ 26 నుంచి నిందితుడి వాదన 

* జనవరి 6 నుంచి 17 వరకు ప్రాసిక్యూషన్, డిఫెన్స్ మధ్య వాదోపవాదాలు 
* జనవరి 17న ముగిసిన విచారణ ప్రక్రియ 
* హాజీపూర్ నిందితుడికి ఉరిశిక్ష వేయాలని డిమాండ్ 
* శ్రీనివాస్‌రెడ్డి ఉరిశిక్షకు అర్హుడు- ప్రాసిక్యూషన్ 
* ప్రాసిక్యూషన్ వాదనను తిప్పికొట్టిన డిఫెన్స్