యుద్ధవిమానాల సమాచారాన్ని ISIకి చేరవేస్తున్నHAL ఉద్యోగి అరెస్ట్

HAL Employee Supplying Fighter Jet Details To ISI: భారత యుద్ధవిమానాలకు సంబంధించిన రహస్య సమాచారాన్ని పాకిస్థాన్ గూఢచర్య సంస్థ(ISI)కి చేరవేస్తున్నహిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(HAL)ఉద్యోగి దీపక్ షిర్శత్(41) ను ఇవాళ(అక్టోబర్-9,2020)మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్వాడ్ అరెస్ట్ చేసింది.


HALలో అసిస్టెంట్ సూపర్ వైజర్ గా పనిచేస్తున్న దీపక్….వాట్సాప్ మరియు సోషల్ మీడియా ద్వారా యుధ్దవిమానాల రహస్య సమాచారాన్ని మరియు నాసిక్ దగ్గర్లోని ఒజర్ లో ఉన్న HAL ఎయిర్ క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ గురించిన సమాచారాన్ని ఐఎస్ఐకి చేరవేస్తున్నట్లు తాము గుర్తించామని డీసీపీ వినయ్ రాథోడ్ తెలిపారు.

దీపక్ నుంచి మూడు సెల్ ఫోన్లు,ఐదు సిమ్ కార్డులు,రెండు మొమొరీ కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. దీపక్ పై అఫీషియల్ సీక్రెట్ యాక్ట్ కింద కేసు నమోదుచేసినట్లు చెప్పారు.