హర్యానాలో విషాదం : ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీకి వెళ్లి వస్తూ..

  • Publish Date - September 25, 2019 / 03:42 AM IST

హర్యానా రాష్ట్రంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీకి వెళ్లి..వస్తున్న యువకులు అనంతలోకాలకు వెళ్లిపోయారు. వారు ప్రయాణిస్తున్న ఆటోను ఆయిల్ ట్యాంకర్ ఢీకొనడంతో 10 మంది మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయయి. వీరిని సమీప ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన జింద్‌ – హిస్సార్ రోడ్డులో చోటు చేసుకుంది. 

ప్రమాదానికి సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు. ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీలో పాల్గొనేందుకు యువకులు వచ్చారని జింద్ డీఎస్పీ కప్తాన్ సింగ్ తెలిపారు. అందులో 11 మంది వారి వారి స్వగ్రామాలకు వెళ్లేందుకు సిద్ధమయినట్లు, ఓ ఆటోలో వీరందరూ ఎక్కారన్నారు.  రామ్ రాయ్ సమీపంలోకి రాగానే ఆటోను ఆయిల్ ట్యాంకర్ బలంగా ఢీకొనడంతో స్పాట్‌‌లోనే 9 మంది చనిపోయారన్నారు.

ఆస్పత్రికి తరలిస్తుండగా మరొకరు చనిపోయారని తెలిపారు. మృతి చెందిన వారిలో ఐదుగురు బురదహర్ ప్రాంతానికి చెందిన వారుగా గుర్తించినట్లు వెల్లడించారు. వారి వారి కుటుంబసభ్యులకు సమాచారం అందించినట్లు, ఇతరులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. 
Read More : మండుతున్న చమురు ధరలు : సామాన్యుడి జేబుకు చిల్లు