మహాముదురు.. శివ బాలకృష్ణ అక్రమాస్తుల కేసు, రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు

కేవలం డాక్యుమెంట్ల ప్రకారమే శివ బాలకృష్ణ ఆస్తుల విలువ రూ.10కోట్లు అని గుర్తించిన అధికారులు, బహిరంగ మార్కెట్ లో దీని విలువ పది రెట్లు ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

HMDA Ex Director Shiva Balakrishna Case

Shiva Balakrishna : హెచ్ఎండీఏ (Hyderabad Metropolitan Development Authority) మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ అక్రమాస్తుల కేసులో దర్యాఫ్తు ముమ్మరం చేశారు. శివ బాలకృష్ణను కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ అధికారులు కోరారు. బాలకృష్ణ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు ప్రస్తావించారు. లేఔట్ల అనుమతుల కోసం భారీగా లంచాలు డిమాండ్ చేశారని పేర్కొన్నారు. చాలా దరఖాస్తుల్లో తప్పులు ఉన్నాయన్న సాకుతో లంచాలు తీసుకున్నట్లు గుర్తించారు. శివ బాలకృష్ణ ఆధ్వర్యంలో హెచ్ఎండీఏ, రేరాలో అక్రమాలు జరిగినట్లు విచారణలో వెల్లడైంది.

మొత్తం 45 పేజీల రిమాండ్ రిపోర్టులో పలు కీలక అంశాలు ప్రస్తావించారు ఏసీబీ అధికారులు. శివ బాలకృష్ణకు సంబంధించి 4కోట్ల 90 లక్షల రూపాయలు విలువైన స్థిరాస్తులు, 8కోట్ల 20లక్షల రూపాయల విలువైన చరాస్తులు గుర్తించారు. కేవలం డాక్యుమెంట్ల ప్రకారమే శివ బాలకృష్ణ ఆస్తుల విలువ రూ.10కోట్లు అని గుర్తించిన అధికారులు, బహిరంగ మార్కెట్ లో దీని విలువ పది రెట్లు ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Also Read : అర్థరాత్రి కలకలం.. ఉస్మానియా పీజీ ఉమెన్స్ హాస్టల్ బాత్రూంలోకి చొరబడ్డ ఆగంతకులు

ప్లాట్ల నిర్మాణ అనుమతులు ఇచ్చేందుకు శివ బాలకృష్ణ విల్లాలను లంచంగా పొందారని, వాటిని బినామీల పేరిట రిజిస్ట్రేషన్ చేయించారని గుర్తించారు. ఇక, హెచ్ఎండీఏ ఆఫీసులోని 5వ అంతస్తులో కొద్దిమందికి మాత్రమే ప్రవేశం ఉండేదని, బాలకృష్ణకు పరోక్షంగా 30మంది అధికారులు సహకరించారని ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. ఈ క్రమంలో మరింత సమాచారం రాబట్టేందుకు బాలకృష్ణ ఫోన్లను రిట్రైవ్ చేస్తున్నారు. రెండేళ్ల క్రితమే బాలకృష్ణపై ఏసీబీకి ఫిర్యాదులు అందాయి. హెచ్ఎండీఏలోని మూడు జోన్లపై బాలకృష్ణకు పట్టుంది. ఆయన పరిధిలో ఉన్న జోన్ లో ఒక్కో ఎకరం రూ.20 కోట్లపైనే ఉంటుందని తెలిపారు. వట్టినాగులపల్లిలో భూవినియోగ మార్పిడి జీవోపై ఏసీబీ ఫోకస్ పెట్టింది. బాలకృష్ణను కస్టడీలోకి తీసుకున్న తర్వాత బ్యాంకు లాకర్లను ఓపెన్ చేయించారు ఏసీబీ అధికారులు.

Also Read : తీగలాగే కొద్దీ బయటపడుతున్న శివ బాలకృష్ణ అక్రమాలు.. మొన్నటి వరకు గొప్ప హోదా.. ఇప్పుడు చంచల్‌గూడ జైల్‌కు..

 

ట్రెండింగ్ వార్తలు