పెట్రోల్ పోసి భార్యాపిల్లలను తగలబెట్టేందుకు యత్నం
విశాఖపట్నంలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి పెట్రోల్ పోసి భార్యాపిల్లలను తగలబెట్టేందుకు ప్రయత్నించాడు.

విశాఖపట్నంలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి పెట్రోల్ పోసి భార్యాపిల్లలను తగలబెట్టేందుకు ప్రయత్నించాడు.
విశాఖపట్నంలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి పెట్రోల్ పోసి భార్యాపిల్లలను తగలబెట్టేందుకు ప్రయత్నించాడు. నగరంలోని బీసీ రోడ్డు నేతాజీ నగర్‌లో దుర్గారావు అనే వ్యక్తి భార్యపిల్లలతో నివాసముంటున్నాడు. దుర్గారావు నిత్యం భార్యను వేధిస్తున్నాడు.
ఈ క్రమంలో దుర్గారావు బాటిల్‌లో పెట్రోల్ తీసుకొచ్చి భార్యాపిల్లలపై చల్లబోయాడు. వారిని తగులపెట్టేందుకు ప్రయత్నించాడు. వారు కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అతన్ని అడ్డుకున్నారు. దీంతో దుర్గారావు అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికులు గాజువాక పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనాస్థలికి చేరుకున్నారు.
బాధితురాలి దగ్గరి నుంచి ఫిర్యాదు తీసుకున్నారు. తన భర్త నిత్యం వేధిస్తున్నాడని, అతడి నుంచి ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొంది. అతని నుంచి కాపాడాలని బాధితురాలు పోలీసులను వేడుకున్నారు. నిందితుడిని జైల్లో పెట్టి.. మీకు రక్షణ కల్పించే బాధ్యత తమదని పోలీసులు ఆమెకు చెప్పారు.