Husband Trouble Wife : ఇదెక్కడి శాడిజంరా నాయనా..! మాజీ భార్యని కేసుల్లో ఇరికించేందుకు ఆ భర్త ఏం చేశాడో తెలుసా..
భార్య పై కోపం పెంచుకున్న భర్త.. ఆమెపై ప్రతీకారానికి ఖతర్నాక్ స్కెచ్ వేశాడు.

Husband Trouble Wife : తన మాజీ భార్యని న్యాయపరమైన చిక్కుల్లో ఇరికించేందుకు ఓ భర్త చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అతడు చేసిన నిర్వాకం తెలుసుకుని అంతా విస్తుపోతున్నారు. ఇదెక్కడి శాడిజం రా నాయనా అని ముక్కున వేలేసుకుంటున్నారు. ఇంతకీ అతడు ఏం చేశాడో తెలుసా.. పదే పదే ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించాడు.
అదే పనిగా ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేయడం, పోలీసులకు దొరికిపోవడం, చలానా వేయించుకోవడం.. ఇది పరిపాటిగా మారింది. అయితే, ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. అతడు నడిపే మోటర్ సైకిల్… అతడి మాజీ భర్య పేరు మీద ఉంది. తప్పు ఇతడు చేసినా చలాన్లు ఆమెకు వెళ్లేవి. అలా ఆమెను టార్చర్ పెట్టాడు.
ఆమెను టార్చర్ పెట్టాలని నిర్ణయించుకున్నాడు..
ఈ చిత్రవిచిత్ర ఘనట పాట్నాలో జరిగింది. ఏదో విబేధాలు రావడంతో ఓ జంట విడిపోయింది. భార్యను పుట్టింటి వారు పిలుచుకుపోయారు. కోర్టులో విడాకుల కేసు నడుస్తోంది. అయితే, భార్యపై కోపం పెంచుకున్న భర్త.. ఆమెను టార్చర్ పెట్టాలని నిర్ణయించుకున్నాడు. అంతే, అప్పటి నుంచి పదే పదే మోటార్ సైకిల్ తో ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడ్డాడు. ఎందుకంటే.. ఆ బైక్ భార్య పేరు మీద రిజిస్ట్రర్ అయ్యి ఉంది. దాంతో ట్రాఫిక్ చలాన్లు ఆమె ఫోన్ కు వెళ్లేవి.
ముజఫర్ పూర్ కి చెందిన మహిళకు పాట్నాకు చెందిన వ్యక్తితో ఏడాది క్రితం పెళ్లైంది. పెళ్లి కానుకలో భాగంగా అతడి మామ కొత్త అల్లుడికి బైక్ కొనిచ్చారు. అయితే, ఆ బైక్ భార్య పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించారు. అయితే, పెళ్లైన కొన్నాళ్లకు ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. దాంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది.
Also Read : ఇదెక్కడి రిజెక్షన్ రా మావా.. పెళ్లికొడుకు సిబిల్ స్కోర్ తక్కువ ఉందని.. పెళ్లి క్యాన్సిల్ చేసిన వధువు
ఆమెపై ప్రతీకారానికి ఖతర్నాక్ స్కెచ్ వేశాడు..
భార్య పై కోపం పెంచుకున్న భర్త.. ఆమెపై ప్రతీకారానికి ఖతర్నాక్ స్కెచ్ వేశాడు. పదే పదే మోటార్ సైకిల్ తో ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేశాడు. ఇలా గత మూడు నెలల వ్యవధిలో నాలుగు చలాన్లు వచ్చాయి. తొలుత ఆమె చలాన్లకు డబ్బులు కట్టింది. అయితే పదే పదే ట్రాఫిక్ పోలీసుల నుంచి చలాన్లు వస్తుండటంతో ఆమెకు భర్త పై డౌట్ వచ్చింది. కావాలనే అతడు ఇలా చేస్తున్నాడని తెలుసుకుని విస్తుపోయింది.
వెంటనే భర్త దగ్గరికి వెళ్లి గొడవకు దిగింది. బైక్ వెనక్కి ఇవ్వాలని అడిగింది.అయితే, బైక్ ని తిరిగి ఇచ్చేందుకు అతగాడు ఒప్పుకోలేదు. కోర్టులో విడాకుల కేసు నడుస్తోందని, అది తేలాకే బైక్ ఇచ్చేస్తానని తెగేసి చెప్పాడు. అతడి తీరుతో విసిగిపోయిన ఆమె.. న్యాయం చేయండి అంటూ పోలీసులను ఆశ్రయించింది. భర్తపై కేసు పెట్టింది. తన బైక్ తనకు ఇప్పించాలని పోలీసులను వేడుకుంది.
మనస్పర్ధలతో విడిపోయిన భార్యను టార్చర్ పెట్టేందుకు, చట్టపరమైన కేసుల్లో ఇరికించేందుకు ఆ భర్త చేసిన నిర్వాకం తెలిసి నెటిజన్లు విస్తుపోతున్నారు. ఇదెక్కడి శాడిజం రా నాయనా అని అవాక్కవుతున్నారు.