CIBIL Score : ఇదెక్కడి రిజెక్షన్ రా మావా.. పెళ్లికొడుకు సిబిల్ స్కోర్ తక్కువ ఉందని.. పెళ్లి క్యాన్సిల్ చేసిన వధువు

Maharashtra Groom : వరుడి సిబిల్ స్కోరును చెక్ చేయాలని వధువు తండ్రి పట్టుబట్టడంతో చివరి నిమిషంలో వివాహం రద్దు అయింది.

CIBIL Score : ఇదెక్కడి రిజెక్షన్ రా మావా.. పెళ్లికొడుకు సిబిల్ స్కోర్ తక్కువ ఉందని.. పెళ్లి క్యాన్సిల్ చేసిన వధువు

Maharashtra groom

Updated On : February 8, 2025 / 4:07 PM IST

CIBIL Score : చాలా కుటుంబాలు కలిసి పెళ్లి విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు కుటుంబ నేపథ్యం, ఆర్థిక స్థిరత్వం, జాతక అనుకూలత వంటి అంశాలు తరచుగా కీలకంగా మారుతాయి. కానీ, మహారాష్ట్రలోని ముర్తిజాపూర్‌కు చెందిన ఒక వ్యక్తికి, అతని సిబిల్ స్కోరు ఊహించని డీల్‌బ్రేకర్‌గా మారింది. నివేదిక ప్రకారం.. వధువు మామ వరుడి సిబిల్ స్కోర్‌ను చెక్ చేయాలని పట్టుబట్టడంతో చివరి నిమిషంలో వివాహం రద్దు అయింది.

Read Also : Delhi Assembly Results 2025 : ఢిల్లీ ఫలితాల్లో ‘ఆప్’ పతనానికి 5 ప్రధాన కారణాలేంటి? ఈ తప్పిదాలే కేజ్రీవాల్ పార్టీని దెబ్బతీశాయా?

రెండు కుటుంబాలు పెళ్లిని దాదాపుగా ఖరారు చేశాయి. పెళ్లి పనులు కూడా మొదలుపెట్టారు. కానీ, వధువు మామ వరుడి ఆర్థిక పరిస్థితి గురించి ఆందోళన వ్యక్తం చేశాడు. అతడి సిబిల్ రిపోర్టును చూపించమని అడిగాడు. రుణాలు, క్రెడిట్ కార్డ్ వినియోగం, తిరిగి చెల్లించడం సహా క్రెడిట్ హిస్టరీని అడిగి తెలుసుకున్నారు.

పెళ్లికొడుకు సిబిల్ స్కోరు విషయం తెలిసిన వెంటనే వధువు కుటుంబం దిగ్భ్రాంతికి గురైంది. ఆ వ్యక్తి వివిధ బ్యాంకుల నుంచి అనేక రుణాలు తీసుకున్నాడని, తక్కువ సిబిల్ స్కోరు కలిగి ఉన్నాడని నివేదిక వెల్లడించింది. అలాంటి స్కోరు తరచుగా రుణ ఎగవేతలు లేదా క్రమరహిత చెల్లింపుల కారణంగా ఆర్థిక అస్థిరతను సూచిస్తుంది.

సిబిల్ స్కోర్ అంటే ఏంటి? :
క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (ఇండియా) లిమిటెడ్ అందించే సిబిల్ స్కోరు, సాధారణంగా 300 నుంచి 900 వరకు ఉండే మూడు అంకెల సంఖ్య. ఇది ఒక వ్యక్తి క్రెడిట్ హిస్టరీపై ఆధారపడి ఉంటుంది. రుణాలు, క్రెడిట్ కార్డులు కాలక్రమేణా ఎలా మేనేజ్ చేయాలి? ఎలా తిరిగి చెల్లించడం జరుగుతుంది అనేదాని గురించి వివరిస్తుంది. స్కోరు ఎంత ఎక్కువగా ఉంటే.. రుణదాతల నుంచి ఎక్కువగా నమ్మకం కలుగుతుంది. తద్వారా రుణాలు, ఇతర రకాల క్రెడిట్‌లకు అర్హతను పొందడంలో కీలకంగా మారుతుంది.

Read Also : Delhi Election Results : ఢిల్లీ ఓటర్లకు సెల్యూట్‌.. అభివృద్ధి మా గ్యారంటీ: ఫలితాలపై మోదీ ట్వీట్‌!

“ఒక పురుషుడు ఇప్పటికే అప్పుల్లో కురుకుపోతే.. తన భార్యకు ఆర్థిక భద్రతను ఎలా కల్పించగలడు?” అని వధువు మామ అడిగినట్లు తెలుస్తోంది. కుటుంబంలోని మిగిలిన వారంతా ఏకీభవించి వెంటనే పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్నారు. వివాహలకు ఆర్థికంగా బలంగా ఉండటం అనేది నేటి ప్రపంచంలో చాలా అవసరం. క్రెడిట్ స్కోరు వంటి సాధారణ విషయం వ్యక్తిగత సంబంధాల భవిష్యత్తును ఎలా నిర్ణయిస్తుందో ఈ సంఘటన ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోంది.