Husband Killed Wife: ఓ భర్త తన భార్యను అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఆమె తల నరికేశాడు. శరీరాన్ని 17 ముక్కలు చేశాడు. మహారాష్ట్రలోని బీవానీ సిటీలో ఈ దారుణం జరిగింది. ఆ మహిళ తల ఒక వధశాల ప్రాంతంలో దొరికింది. ఈ హత్య ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది. స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది. కాగా, భార్యను అత్యంత కిరాతకంగా భర్త హత్య చేయడానికి కారణం ఏంటో ఇంకా తెలియరాలేదు. నిందితుడు తాహా పోలీసుల విచారణలో ఒక్కోసారి ఒక్కో మాట చెబుతున్నాడు.
దాదాపు 25 నుండి 28 సంవత్సరాల వయస్సున్న మహిళ తలను పోలీసులు మురికివాడలోని వధశాల ప్రాంతం సమీపంలో గుర్తించారు. పోలీసులు తాహాను అరెస్ట్ చేశారు.
పోలీసుల విచారణలో తాహా షాకింగ్ విషయాలు చెప్పాడు. తన భార్య పర్వీన్ అలియాస్ ముస్కాన్ మొహమ్మద్ తాహా అన్సారీని హత్య చేసి శరీర భాగాలను ముక్కలు చేసి నగరం అంతా పారవేసినట్లు పోలీసులతో చెప్పాడు. తన భార్య శరీరాన్ని 17 ముక్కలుగా నరికినట్లు అతను చెప్పాడని పోలీసులు వెల్లడించారు.
మిగిలిన శరీర భాగాలను కనుగొనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకోసం డ్రోన్లు, అగ్నిమాపక దళాలను మోహరించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. తన కూతురు ముస్కాన్ కనిపించడం లేదంటూ ఆమె తల్లి హనీఫా ఖాన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.
”రెండు రోజులుగా నా కూతురి ఫోన్ స్విచ్చాఫ్ వచ్చింది. నా అల్లుడికి ఫోన్ చేస్తే ఎత్తడం లేదు. దీంతో నేను పోలీసులను ఆశ్రయించాను” అని ముస్కాన్ తల్లి తెలిపింది. కాగా, పోలీసులు తమకు దొరికిన తల ఫోటోను ఆమెకు చూపించగా.. అది తన కూతురిదేనని ఆమె గుర్తుపట్టింది. తలను పోలీసులు ఇందిరాగాంధీ సబ్ డిస్ట్రిక్ ఆసుపత్రికి పంపారు.
తాహా తన భార్యను ఇంత దారుణంగా ఎందుకు చంపాడు? ఎక్కడ హత్య చేశాడు? మర్డర్ కి ఉపయోగించిన ఆయుధం ఏది? అనే వివరాలు తెలుసుకునే పనిలో పోలీసులు ఉన్నారు. ఈ కేసులో మిస్టరీని చేధించేందుకు రెండు ప్రత్యేక విచారణ బృందాలు రంగంలోకి దిగాయి.
Also Read: 4 నెలల్లో 40 మంది మృతి.. గుంటూరు జిల్లా తురకపాలెంలో భయం భయం.. అసలేం జరుగుతోంది?