Court Sentenced To Life Imprisonment With Daughter Testimony
Husband Kills His Wife : 8 ఏళ్ల కూతురు మా నాన్న హంతకుడు అని న్యాయస్థానానికి చెప్పింది. దీంతో ఆ పాప తండ్రికి కోర్టు జీవిత ఖైదు విధించిన ఘటన కర్ణాటకలో జరిగింది. ‘మా నాన్న అమ్మను చంపటం నేను చూశా..అంటూ చిన్నారి చెప్పిన మాటల్ని కోర్టు అత్యంత కీలక సాక్ష్యంగా పరిగణించింది. దీంతో చామరాజనగర అదనపు జిల్లా సెషన్స్ కోర్టు భార్యను చంపిన భర్తకు జీవిత ఖైదు విధించింది.
కర్ణాటకలోని చామరాజనగర జిల్లా కోళిపాళ్య గ్రామానికి చెందిన తొళచనాయక్,పుష్పబాయి భార్యాభర్తలు. వీరికి 8 ఏళ్ల కూతురు ఉంది. పుష్పబాయి వివాహం సయమంలో పుష్పబాయికి పుట్టింటివారు 20 గ్రాముల బంగారు నెక్లెస్‌ను ఇచ్చారు. తొళచనాయక్ తమ్ముడి ఇంటిలో ఏవో ఆర్థిక సమస్యలు వచ్చాయి. దీంతో తోళచనాయక్ తమ్ముడి కోసం తన భార్య పుష్పబాయి నెక్లెస్ కుదువ పెట్టి డబ్బులు తెచ్చి తమ్ముడికిచ్చాడు. చాలా కాలం అయిపోతోంది. ఓ పక్క వడ్డీ కూడా పెరిగిపోతోంది నెక్లెస్ విడింపిచాలని పుష్పబాయి భర్తను అడుగుతోంది. కానీ తోళయనాయక్ వినిపించుకోలేదు.
Read more : Indian-Origin Malaysian: ఆన్‌లైన్‌లో అడిగారు.. ఉరిశిక్ష ఆపేశారు
కానా నెక్లెస్‌ను విడిపించుకురావాలని భార్య ఒత్తిడి చేసేది. దీంతో తొళయనాయక్ కు భార్యపై ఆగ్రహం వెల్లువెత్తింది. విచక్షణ కోల్పోయాడు. ఇంట్లో ఉన్న వేటకొడవలితో భార్యపై దాడికి దిగాడు. ఒళ్లు తెలియని ఉన్మాదంతో ఇష్టమొచ్చినట్లుగా నరికేశాడు. ఈ 2017 మార్చి 27న జరిగిన ఈ దారుణంలో పుష్పబాయి ప్రాణాలు కోల్పోయింది. ఈ కేసు విచారణకొనసాగి కొనసాగగా..చివరికి ఈ కేసులో పుష్పభాయి దంపతులు కూతురు ‘మా అమ్మను చంపటం నేను చూశాను..ఆనాటి ఘటన నాకు ఇంకా కళ్లముందే ఉంది’అంటూ సాక్ష్యం చెప్పింది. దీంతో చామరాజనగర అదనపు జిల్లా సెషన్స్ కోర్టుతండ్రి దాష్టీకంపై కూతురు సాక్ష్యం చెప్పడంతో నేర నిర్ధారణ కావటంతో తోళచనాయక్ కు జీవితఖైదును విధించింది కోర్టు.
Read more : UP : బరి తెగించిన అధికారి..సహోద్యోగినిపై లైంగిక వేధింపులు, వీడియో వైరల్