Indian-Origin Malaysian: ఆన్‌లైన్‌లో అడిగారు.. ఉరిశిక్ష ఆపేశారు

భారత సంతతికి చెందిన మలేసియా వ్యక్తికి ఖరారుచేసిన ఉరిశిక్షను ఆపేశారు. ఆన్ లైన్ లో శిక్షను రద్దు చేయాలంటూ వినతులు వెల్లువెత్తాయి.

Indian-Origin Malaysian: ఆన్‌లైన్‌లో అడిగారు.. ఉరిశిక్ష ఆపేశారు

Judgement

Indian-Origin Malaysian: భారత సంతతికి చెందిన మలేసియా వ్యక్తికి ఖరారుచేసిన ఉరిశిక్షను ఆపేశారు. ఆన్ లైన్ లో శిక్షను రద్దు చేయాలంటూ వినతులు వెల్లువెత్తాయి. డ్రగ్ ట్రాఫికింగ్ చేస్తున్న కేసులో ఆరోపణలు ఎదుర్కొని నేరం రుజువు కావడంతో శిక్ష విధించారు. మానసికంగా దివ్యాంగుడైనటువంటి నాగేంద్రన్ కే ధర్మలింగంను ఉరితీయాలంటూ తీర్పు వచ్చింది.

బుధవారం ఛంగీ జైలులో ఉరితీసేందుకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఈ లోగా ఆన్‌లైన్‌లో వచ్చిన వినతులపై సింగపూర్ హై కోర్ట్ స్పందించింది. ఆన్‌లైన్ హియరింగ్ తో శిక్షను ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. నాగేంద్రన్ లాయర్ ఎం రవి ఫేస్ బుక్ లో పోస్టు చేసి ఉరిశిక్ష వాయిదా పడినట్లుగా హైకోర్టు తీర్పు ఇచ్చిందని పేర్కొన్నారు. దీనిపై మంగళవారం వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా విచారణ జరగనుంది.

2009లో 21ఏళ్ల వయస్సున్న నాగేంద్రన్ వుడ్ ల్యాండ్స్ చెక్ పాయింట్ వద్ద డ్రగ్స్ ట్రాఫికింగ్ చేస్తూ దొరికిపోయాడు. సింగపూర్, పెనిన్సులర్ మలేసియల మధ్య సరఫరా చేస్తున్నట్లుగా తెలిసింది. నవంబర్ 2010లో 42.72గ్రాములు హెరాయిన్ తరలించినందుకు మరణశిక్ష విధించింది కోర్టు.

…………………………………………….. : తారక్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ఫిబ్రవరిలో పూజ..

డ్రగ్స్ యాక్ట్ ప్రకారం.. 15గ్రాముల కంటే హెరాయిన్ ఎగుమతి చేయడం నేరం. అలా శిక్షను ఎదుర్కొంటున్న నాగేంద్రన్ ను కాపాడాలంటూ అతని తల్లి సోషల్ మీడియా వేదికగా సపోర్ట్ కోసం లెటర్ పోస్టు చేసింది. దానిపై భారీ ఎత్తులో పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో ప్రస్తుతానికి ఉరిని వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు.